శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'భరత్ అనే నేను' చిత్రం. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వాని కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ - లింగంపల్లి సమీపంలోని ఓ థియేటర్లో జరుగుతోంది.
మహేష్ బాబు తదితరులపై ఫైట్ సీన్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ సినిమాలో కీలకమైన సందర్భంలో వస్తుందనీ, ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మహేష్ సీఏం పాత్రలో కనిపించనున్నాడు.
దేవి మ్యూజిక్ ఈ సినిమా హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మార్చి రెండో వారంలో ఆడియో లాంచ్ చేసి.. ఏప్రిల్ 26 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు. కొరటాల .. మహేష్ క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటం వలన అందరిలోనూ భారీ అంచనాలు వున్నాయి.