గత ఏడాది మెహ్రీన్ కౌర్ క్రేజ్ టాలీవుడ్ లో మాములుగా లేదు. వరుస హిట్స్ తో అమ్మడుకి తిరుగు లేదనుకున్నారు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' నుండి 'రాజా ది గ్రేట్' వరకు మెహ్రీన్ కి మ్యాగ్జిమమ్ అన్ని హిట్స్ అందులో ఒక్క జవాన్ తప్ప. గత ఏడాది అయితే మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల హిట్స్ మెహ్రీన్ కి అనేక అవకాశాలు కల్పించి బిజీ హీరోయిన్ ని చేస్తాయనుకున్నారు అంతా. కానీ మెహరీన్ బ్యాడ్ లక్ కాదు గాని.... ఆమె సరైన డైట్ చెయ్యకపోవడం వలన విపరీతంగా బరువు పెరగడంతో.. గ్లామర్ రోల్స్ లో మెహ్రీన్ బాగా లావుగా కనబడడం వలెనే ఆమెకు స్టార్స్ పక్కన అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే అందులో ఒక మంచి సూపర్ హిట్ ఆఫర్ ని మెహ్రీన్ చేజార్చుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేనండి వరుణ్ తేజ్ - రాశిఖన్నాలు జంటగా తెరకెక్కిన తొలిప్రేమలో ముందుగా ఆ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి మెహ్రీన్ కౌర్ నే అనుకున్నాడట. కేవలం అనుకోవడం మాత్రమే కాదు మెహ్రీన్ ని దర్శక నిర్మాతలు సంప్రదించారట కూడా. కానీ తర్వాత మెహ్రీన్ బరువుతో లావుగా కనబడడం.... ఆ టైం లో మరో బొద్దుగుమ్మ రాశిఖన్నా బాగా వెయిట్ తగ్గి సన్నగా నాజూగ్గా తయారవడంతో.... తొలిప్రేమ ఆఫర్ రాశిఖన్నాకి వెళ్లిపోయిందట. మరి కేవలం లావుగా ఉండడం వలెనే తొలిప్రేమ సినిమా ఛాన్స్ మెహ్రీన్ నుంచి రాశిఖన్నాకు వెళ్లింది.
మరి రాజా ది గ్రేట్ సినిమా విడుదల సమయంలోనే మెహ్రీన్ బరువు ఆమెకు చేటు చేస్తుందని చాలామంది అభిప్రాయం పడ్డారు. మరి ఆ విషయం మెహ్రీన్ వరకు వెళ్ళలేదంటారా... లేదంటే వినినా విననట్టుగా మెహ్రీన్ ఉండిపోయిందో తెలియదు గాని... ఒక సూపర్ హిట్ ఛాన్స్ మాత్రం మెహ్రీన్ కేవలం తన బరువు కారణంగా చేజార్చుకోవడం మాత్రం బాధాకరమే. మరి ప్రస్తుతం గోపీచంద్ వంటి ఫామ్ లో లేనినటుడితో పంతం సినిమా తప్ప అమ్మడుకు చేతిలో మరే సినిమా లేదు.