గత కొన్ని ఏళ్ళ నుండి టాలీవుడ్ మార్కెట్ బాగానే వుంది. స్టార్ హీరో సినిమాలు మినిమమ్ 50 కోట్లు ఈజీగా దాటేస్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి సినిమాతో మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. గత సినిమా సరైనోడు.. డీజే.. సినిమాలు మంచి టాక్ తెప్పించుకోకపోయిన ప్రొడ్యూసర్స్ కు భారీ లాభాలు అందించాయి.
ప్రస్తుతం బన్నీ కొత్త దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అలజడి సృష్టించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. సినిమా మార్కెట్ 100 కోట్లు దాటడం పక్కాగా అనిపిస్తోంది.
ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే థియేట్రికల్ రైట్స్ మొత్తంగా 80 కోట్లకు అమ్ముడు పోయింది. బన్నీ కెరీర్ మొదటిసారి నైజాం ఏరియాలో భారీ ధర పలికింది. 21.5 కోట్లకు క్యాంటీన్ ప్రసాద్ దక్కించుకొని ఏషియన్ ఫిలిమ్స్ తో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఒకవేళ సినిమా నైజాంలో 25 కోట్లను దాటితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.1.5కోట్లని నిర్మాతలకు అందించాల్సి ఉంటుంది. ఈ సినిమా మార్కెట్ అయితే బాగానే వుంది కానీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.