గతంలో ఎన్టీఆర్.. హిట్ డైరెక్టర్స్ వెంట తిరుగుతాడు అని టాక్ ఉండేది. కిక్ సినిమా తర్వాత సురేంద్ర రెడ్డి.. కందిరీగ తర్వాత సంతోష్ శ్రీనివాస్..దూకుడు తర్వాత శ్రీను వైట్లతో చేసాడు. కానీ అతను ఆశించిన ఫలితాలు ఎదురవ్వలేదు. కానీ ఎప్పుడైతే ప్లాప్ లో వున్న డైరెక్టర్ పూరి తో టెంపర్ చేసాడో అప్పటి నుండి ఆ పేరు పోయింది.
హార్ట్ ఎటాక్ వంటి ప్లాప్ సినిమా తర్వాత పూరికి ఛాన్స్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు ఎన్టీఆర్. అప్పటి నుండి అతని విజయం కొనసాగుతూనే వుంది. ఆ తర్వాత ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ తీసిన సుకుమార్ దర్శకత్వంలో తారక్ ‘నాన్నకు ప్రేమతో’లో నటించాడు. అది హిట్ అయింది. మళ్లీ సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చినా బాబీ డైరెక్షన్ లో 'జై లవకుశ' సినిమాలో చేశాడు. ఈ సినిమా బయర్స్ కు లాభాలు తెచ్చిపెట్టకపోయిన... ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కు మాత్రం భారీగానే లాభాలందించింది. ఇలా ప్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు తీసి సక్సెస్ అవుతున్నాడు తారక్.
అలానే ‘అజ్ఞాతవాసి’ వంటి ఆల్ టైం డిజాస్టర్ తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టబోతున్నాడు. అసలే అజ్ఞాతవాసి తో పరువు పోగొట్టుకున్న త్రివిక్రమ్.. ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో, సెంటిమెంటు కొనసాగి ఎన్టీఆర్ కు అతను హిట్టే ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిజంగానే తారక్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మంచి హిట్ వస్తుందేమో చూద్దాం.