Advertisementt

'అ!'.. 'మనసుకు నచ్చుతుందా'..?

Thu 15th Feb 2018 07:20 PM
awe,manasuku nachhindi,sundeep kishna,prasanth varma,nani,manjula  'అ!'.. 'మనసుకు నచ్చుతుందా'..?
Nani Awe Vs Sundeep Kishan Manasuku Nachhindi 'అ!'.. 'మనసుకు నచ్చుతుందా'..?
Advertisement
Ads by CJ

ఈనెల 16వ తేదీన ఘట్టమనేని మంజుల దర్శకత్వంలో రూపొందుతున్న 'మనసుకు నచ్చింది', నాని నిర్మాతగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ!' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. మంజులతో పాటు ప్రశాంత్‌ వర్మకి కూడా ఇదే మొదటి చిత్రం. ఇక ప్రమోషన్స్‌పరంగా ఇతరులతో నానికి ఉన్న పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విషయంలో మంజులకి కూడా మంచి పరిచయాలున్నాయి. 

ఇక 'అ!' చిత్రం విషయానికి వస్తే ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రెజీనా, నిత్యామీనన్‌, ఈషాహెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి, మురళీశర్మ వంటి భారీతారాగణం నటిస్తోంది. 'మనసుకు నచ్చింది'లో సందీప్‌కిషన్‌ అమైరా దస్తూర్‌, త్రిధా చౌదరిలు నటిస్తున్నారు. 'అ!' చిత్రం విషయానికి వస్తే ఇందులోని ప్రధాన పాత్రలంతా ఒక్కటొక్కటిగా వచ్చిపోతాయా? లేక ఈ పాత్రలన్నింటికీ లింక్‌ ఏమైనా ఉంటుందా? అందరు కలిసి నటించే కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయా? అనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌లో అందరు పాల్గొన్న తర్వాత కాజల్‌ ఎంట్రీ ఇచ్చింది? అంటే మిగిలిన పాత్రలకు ఆమె ఇచ్చే రియాక్షన్‌ ఇందులో ఉంటుందా? అనే అనుమానం తలెత్తుతోంది. 

కాజల్‌ పాత్ర పెద్దగా మేకప్‌ లేకుండా కేవలం ఓ కుర్చీలో కూర్చుని చేసే పాత్ర అని, కేవలం ఐదు రోజుల్లో తన షూటింగ్‌ పార్ట్‌ని ఆమె పూర్తి చేసిందని తెలుస్తోంది. సినిమా మెసేజ్‌ ఓరియంటెడ్‌ వినూత్న చిత్రం అయినప్పటికీ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నాని, రవితేజలు వాయిస్‌ఓవర్‌ ఇవ్వడం కూడా దీనికి కలిసొచ్చే విషయమే. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...! 

Nani Awe Vs Sundeep Kishan Manasuku Nachhindi:

Interesting Fight Between Nani and Sundeep Kishna on Feb 16th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ