Advertisementt

చరణ్ బిజీ అని, బన్నీకి ఫిక్స్ అయ్యాడు!

Thu 15th Feb 2018 08:40 AM
koratala shiva,allu arjun,next movie,naa peru surya  చరణ్ బిజీ అని, బన్నీకి ఫిక్స్ అయ్యాడు!
Koratala Siva To Direct Allu Arjun చరణ్ బిజీ అని, బన్నీకి ఫిక్స్ అయ్యాడు!
Advertisement
Ads by CJ

దర్శకుడు కొరటాల శివకి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ ఉంది. ఎందుకంటే కొరటాల డైరెక్ట్ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ.. అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే అయ్యాయి. అందుకే కొరటాలకి మంచి క్రేజ్ ఉంది. కొరటాల శివతో సినిమా చెయ్యాలంటే స్టార్ హీరోలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అందులోను మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కొరటాలను వదులుకునే పరిస్థితుల్లో లేరు. మరి అతి తక్కువ కాలంలోనే కొరటాల టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివ, మహేష్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కొరటాల - మహేష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాని ఏప్రిల్ 27 న విడుదల చేస్తున్నట్టుగా నిన్న ఆ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే 'భరత్ అనే నేను' సినిమా కంప్లీట్ కాగానే కొరటాల శివ, రామ్ చరణ్ తో సినిమా చేస్తారనే టాక్ వినిపించింది. అందుకు కొరటాల కూడా రెడీగానే ఉన్నాడు. కానీ రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం' తోపాటు బోయపాటి సినిమాలోనూ... అలాగే తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లోను నటించనున్నాడు. మరి కొరటాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్  తో చేయబోతున్నాడా? అంటే అవునన్న సమాధానమే వినబడుతుంది ఫిలిం సర్కిల్స్ నుండి. మరి అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశి డైరెక్షన్ లో 'నా పేరు సూర్య' సినిమాలో నటిస్తున్నాడు.

అల్లు అర్జున్ - వక్కంతం సినిమా కూడా ఏప్రిల్ 26 నే వస్తుంది. మరి 'నా పేరు సూర్య' తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తాడని ప్రచారం పాతదే అయినా... ప్రస్తుతం సమాచారం ప్రకారం కొరటాల - అల్లు అర్జున్ సినిమా పక్కా అనే టాక్ బలంగా వినబడుతుంది. మరి అటు 'భరత్ అనే నేను', ఇటు 'నా పేరు సూర్య' విడుదల సమయం దగ్గరపడే సమయానికి కొరటాల - అల్లు అర్జున్ సినిమా మీద పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Koratala Siva To Direct Allu Arjun:

Allu Arjun Joins Hands With Koratala Siva For His Next!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ