Advertisementt

అఖిల్ హీరోయిన్ చేయడంలేదంట..!

Wed 14th Feb 2018 09:55 PM
sayyeshaa saigal,akhil movie,heroine,hero vijay  అఖిల్ హీరోయిన్ చేయడంలేదంట..!
Sayyeshaa About Her Movies అఖిల్ హీరోయిన్ చేయడంలేదంట..!
Advertisement
Ads by CJ

'మెర్శల్‌' చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న విజయ్‌ 'స్పైడర్‌'తో డిజాస్టర్‌ అందుకున్న ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌తో కలిసి 'తుపాకి, కత్తి' తర్వాత హ్యాట్రిక్‌ మూవీ చేస్తున్నాడు. లైకా ప్రోడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ 'దళపతి 62' చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కోల్‌కత్తాలో జరుగుతోంది. ఇందులోని కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను ఫైట్‌ మాష్టర్‌ రామ్‌-లక్ష్మణ్‌లు చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఇక మరోవైపు స్టార్‌ అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో చిత్రం 'విశ్వాసం' కూడా దీపావళికే విడుదల కానుంది. మురుగదాస్‌ చిత్రం తర్వాత విజయ్‌ మరోసారి 'తేరి, మెర్శల్‌' చిత్రాల దర్శకుడు అట్లీతో ఓ చిత్రం. దాని తర్వాత ఇటీవల కార్తి హీరోగా 'ఖాకీ' చిత్రం తీసిన దర్శకుడు వినోద్‌తో మరో చిత్రం చేయనున్నాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. 

ఇక విజయ్‌-మురుగదాస్‌ల చిత్రంలో కీర్తిసురేష్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో తెలుగులో అక్కినేని అఖిల్‌-వినాయక్‌ల కాంబినేషన్‌లో రూపొందిన 'అఖిల్‌' చిత్రం ద్వారా పరిచయమైన సాయేషా సైగల్‌ కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాలలో బిజీగా ఉంది. అయితే ఈ వార్తలను సాయేషా సైగల్‌ ఖండించింది. తాను ఆ చిత్రంలో నటించడం లేదని, అసలు ఆ చిత్రంలో నటించమని తనను ఎవ్వరూ సంప్రదించలేదని ఆమె తెలిపింది.

Sayyeshaa About Her Movies :

Sayyeshaa condemned Chance in Hero Vijay film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ