Advertisementt

ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. స్టార్ అయిపోయింది!

Wed 14th Feb 2018 09:48 PM
priya prakash,magical,video clip,social media  ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. స్టార్ అయిపోయింది!
Priya Prakash Video Clip Sensation ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. స్టార్ అయిపోయింది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు ఫీవర్‌లో నడుస్తోంది. అబ్బాయిలు-అమ్మాయిలు తాము కోరిన వారికి ప్రేమను వ్యక్తీకరించడంలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఓ హైస్కూల్‌ అమ్మాయి అబ్బాయిలు మాటలు లేకుండా కేవలం తమ హావభావాలు, కను రెప్పలు ఎగురవేయడం, కన్ను కొట్టుకోవడం వంటి ద్వారా తమ ప్రేమను వ్యక్తికరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ముఖ్యంగా అమ్మాయి చూపిస్తున్న హావభావాలకు యూత్‌ తెగ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో మలయాళంలో రూపొందుతున్న 'ఒరు ఆధార్‌ లవ్‌' చిత్రంలోనిది. ఈ చిత్రం మార్చి3వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన ఓ పాటను యూనిట్‌ విడుదల చేసింది. ఈ వీడియోలో అమ్మాయి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఓవర్‌ నైట్‌లో సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. 

ఈ ఏడాది ఆమె తమకి ఇచ్చిన అద్భుతమైన ప్రేమికుల రోజు గిఫ్ట్‌గా పలువురు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కి కూడా విపరీతంగా నచ్చింది. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో నేను చూసిన క్యూట్‌ వీడియో ఇది. సింప్లిసిటీ పవర్‌ ఎలా ఉంటుందో చూడండి.. నాకు బాగా నచ్చేసిందని తెలిపాడు. మొత్తానికి బన్నీ వంటి స్టార్‌కి ఈ ముద్దుగుమ్మ నచ్చేయడం చూస్తే మలయాళంలో కూడా ఎంతో క్రేజ్‌ ఉన్న బన్నీ ద్వారా ఈమె తెలుగుకి కూడా హీరోయిన్‌గా పరిచయం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అందునా మలయాళ కుట్టీలంటే మనోళ్లకి ప్రత్యేకమైన అభిమానం కూడా..!

Priya Prakash Video Clip Sensation:

Priya Prakash's Magical Video Clip Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ