నిన్నగాక మొన్న సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్స్ రెండు చేతులా సంపాదిస్తూ తమ హవాని పాపులర్ చేసుకుంటున్నారు. ఒకే ఒక్క హిట్టు వారి జీవితాన్ని అమాంతంగా మార్చేస్తుంది. ఆ ఒక్క హిట్ తో కేవలం పారితోషకమే కాదు.... అనేక సినిమాల్లో అవకాశాలు డబ్బు, హోదా ఇలా అన్ని తన్నుకుంటూ వచ్చేస్తాయి. నిన్నమొన్నటి వరకు కాజల్, తమన్నా, శృతి హాసన్, శ్రియల హవా టాలీవుడ్, కోలీవుడ్లో బాగానే సాగింది. అయితే ఇప్పుడు తాజాగా కొత్త హీరోయిన్స్ హావానే నడుస్తుంది. పూజ హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, అను ఇమ్మాన్యుయేల్ ఇలా తమ హవాని కొనసాగిస్తున్నారు.
కేవలం మంచి ఫామ్ లో ఉండడమే కాదు... తమ రెమ్యునరేషన్ విషయంలోనూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు ఈ తారలు. 'ఒక లైలా కోసం, ముకుందా' సినిమాలతో సో సో హీరోయిన్ గా వున్న పూజ హెగ్డే 'డీజే దువ్వాడ జగన్నాథం'తో అదిరిపోయే హిట్ అందుకుని తన తదుపరి మూవీ సాక్ష్యం కోసం ఏకంగా కోటిన్నర అందుకుంటూ కాస్ట్లీ హీరోయిన్ అయ్యింది. అలాగే నేను శైలజ, నేను లోకల్ సినిమాల్తో హోమ్లీ హీరోయిన్ గా డీసెంట్ గా హిట్స్ అందుకున్న కీర్తి సురేష్ కూడా దాదాపుగా 80 నుండి 90 లక్షల వరకు అందుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాటే.. కోలీవుడ్ లోను బిజీ హీరోయిన్ అయ్యింది.
ఇక మలయాళం నుండి మెరుపులా దూసుకొచ్చిన సాయి పల్లవి ఫిదా, ఎంసీఏ హిట్స్ తో 85 లక్షలు అందుకుంటూ అనతి కాలంలోనే టాప్ రేంజ్ కి ఎదిగింది. ఇక నిన్నుకోరి, జెంటిల్ మేన్ లతో లైమ్ టైంలోకొచ్చిన నివేద థామస్ 70 లక్షలు, అలాగే శతమానభావతి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 60 లక్షలు, అను ఇమ్మాన్యుయేల్ 50 లక్షలు తీసుకుంటూ తమ హవాని టాలీవుడ్ లో కొనసాగిస్తున్నారు.