ఇటీవల నటి అమలాపాల్‌ని ఓ డ్యాన్స్ స్కూల్ యజమాని, వ్యాపారవేత్త అళగేషన్ లైంగిక వేధింపులకు పాల్పడగా అమలాపాల్ దైర్యంగా వెంటనే పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. పోలీసులు కూడా వెంటనే స్పందించి అళగేషన్‌ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాల్ అమలాపాల్ దైర్యాన్ని మెచ్చుకుంటూ, నీగట్స్‌కి గ్రేట్ చెప్పాలి. ఇలాంటి విషయాలలో మాట్లాడాలంటే ఎంతో తెగువ , ధైర్యం ఉండాలి. అలాగే అమలాపాల్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన పోలీసులకు కూడా కృతజ్ఞతలు... అని విశాల్ తెలిపాడు.
దీనిపై అమలాపాల్ స్పందిస్తూ, ఇది కేవలం ఓ మహిళ సమస్యకాదు. అందరిది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరు వెంటనే స్పందించాలని అందరికీ తెలిపిన విశాల్‌కి కృతజ్ఞతలు. ఆ అళగేషన్ అనే వ్యక్తి నాతో వ్యాపారం చేయించాలని భావించాడు. ఆయన వ్యవహారశైలి, ధైర్యం, పరపతి చూసి నాకెంతో భయం వేసింది. ఈ సందర్భంగా మీటు లో పాల్గొన్న విశాల్‌కి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమలాపాల్ తెలియజేసింది.
కాగా మలేషియాలో జరగనున్న ఓ కార్యక్రమం కోసం టి.నగర్‌లో ఏర్పాటు చేసిన నృత్య తరగతుల సందర్భంగా అళగేషన్ అమలాపాల్‌పై ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. మలేషియా వెళ్లినప్పుడు తన స్నేహితునితో కలిసి డిన్నర్‌లో పాల్గొనాల్సిందిగా అమలాపాల్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఇక నుంచైనా ప్రతి ఒక్కరు ఒక విశాల్‌లా ఇలాంటి వాటిని తమ వంతు బాధ్యతగా ఖండించి దోషులకు శిక్ష పడేవరకు బాధితులకు అండగా నిలబడాలని అమలాపాల్ కోరుతోంది.