Advertisementt

వెంకీకి త్రివిక్రమే ఛాన్స్ ఇప్పించాడంట!

Tue 13th Feb 2018 03:08 PM
trivikram srinivas,venky kudumula,chance,chalo movie,director  వెంకీకి త్రివిక్రమే ఛాన్స్ ఇప్పించాడంట!
One More Chance to Chalo Director వెంకీకి త్రివిక్రమే ఛాన్స్ ఇప్పించాడంట!
Advertisement

'ఛలో' సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిన విషయమే. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల మంచి మార్కులే అందుకున్నాడు. పాత కథ అయినప్పటికీ చాలా ఫన్నీగా డైలాగులు జోడించి సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. దీంతో తనతో సినిమాలు చేసేందుకు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ఇందులో భాగంగానే ఓ పెద్ద నిర్మాణ సంస్థ వెంకీకి మంచి ఆఫర్ ఇచ్చిందంట. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ దర్శకుడు తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం వెంకీకి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. వెంకీ దగ్గర ఆల్రెడీ రెండు మూడు కథలు వున్నాయి. అయితే ఏ కథ ఎవరితో తీస్తాడో అని తెలియాల్సివుంది.

ఒక రకంగా వెంకీకి ఈ ఆఫర్ రావడానికి కారణం త్రివిక్రమే. వెంకీ దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేయమని చినబాబుకు చెప్పింది త్రివిక్రమేనట. అలా వెంకీకి ఛాన్స్ వచ్చింది.

One More Chance to Chalo Director:

Trivikram Srinivas Gives Chance to Venky Kudumula  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement