Advertisementt

మెగాహీరోకి భలే ముద్దుపేరుంది!

Tue 13th Feb 2018 03:06 PM
varun tej,tholiprema,hero,pet name,yedhava,family  మెగాహీరోకి భలే ముద్దుపేరుంది!
Varun Tej Pet Name Revealed మెగాహీరోకి భలే ముద్దుపేరుంది!
Advertisement

'ముకుందా', 'కంచె' చిత్రాలతో వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంచుకునే మెగా హీరోగా వరుణ్‌తేజ్‌కి పేరొచ్చింది. మిగిలిన మెగా హీరోలకు భిన్నంగా, ఎప్పుడు అవే మాస్‌, యాక్షన్‌ చిత్రాలు, డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో నెట్టుకొచ్చే హీరోగా కాకుండా వైవిధ్యం కోరుకునే నటునిగా ఆయన్ని అందరు గుర్తించారు. కానీ 'లోఫర్‌, మిస్టర్‌' చిత్రాలతో ఆయన కూడా మూసధోరణిలోకి పోతున్నాడా? అనిపించేలా ఆ చిత్రాలు భారీగా దెబ్బతీశాయి. దాంతో కాస్త ఆలస్యంగానైనా సరే వరుణ్‌తేజ్‌ మేల్కోన్నాడు. సాయిధరమ్‌తేజ్‌లా ఒకే మూస చిత్రాలను కాకుండా 'ఫిదా' చేసి హిట్టు కొట్టాడు. అయినా ఆ చిత్రం విజయం దిల్‌రాజు, సాయిపల్లవిల ఖాతాలో పడినా కూడా నిజాయితీగా తనకంటే సాయిపల్లవి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని ఒప్పుకున్న ఈ మెగాహీరో ఆ తదుపరి తాజాగా 'తొలిప్రేమ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ముందురోజు విడుదలైన సాయిధరమ్‌తేజ్‌ -వినాయక్‌ల 'ఇంటెలిజెంట్‌', మోహన్‌బాబు 'గాయత్రి' సరైన రెస్పాన్స్‌ అందుకోలేకపోవడంతో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన 'తొలిప్రేమ' మాత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ని సాధించింది. యూఎస్‌ ప్రీమియర్ల పుణ్యామా అని మంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మొదటి రోజు 'ఫిదా' కలెక్షన్లను క్రాస్‌ చేసింది. ఇక ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో వరుసగా రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్‌తేజ్‌ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఈయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా రెమ్యూనరేషన్‌ ఎంతో చెప్పను. చెబితే ఐటి ప్రాబ్లమ్స్‌ వస్తాయి. అలాగని అన్ని చిత్రాలకు ఒకే రెమ్యూనరేషన్‌ తీసుకోను. మంచి చిత్రాలకు మినహాయింపు కూడా ఉంటుంది. 

ఇక యూసఫ్‌గూడలోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో బికాం కంప్యూటర్స్‌ చేసిన నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాను. ఎవరైనా అమ్మాయి దొరికితే ఖచ్చితంగా మీకు చెబుతాను. ఇక నన్ను మా నాన్న 'ఎధవ' అని ముద్దుగా పిలుస్తారు. అమ్మ మాత్రం 'వరుణ్‌ బాబూ' అని ముద్దుగా పిలుస్తుంది. నాకు ఇంకా చాలా నిక్‌నేమ్స్‌ ఉన్నాయి. నాకు ప్రభాస్‌తో మంచి స్నేహం ఉంది ఆయనకంటే నేను ఒక అంగుళం ఎత్తు ఎక్కువే. ఇక నా వయసును కూడా దాచుకోను.నేను 1990 జనవరి 19న జన్మించాను. నాకిప్పుడు 28 ఏళ్లు. నా తదుపరి చిత్రాన్ని సైన్స్‌ ఫిక్షన్‌గా, అంతరిక్షం నేపధ్యంలో 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్‌రెడ్డితో చేయనున్నానని తెలిపాడు. మొత్తానికి వైవిధ్య భరిత చిత్రాలు చేసేవారికి కాస్త ఆలస్యంగానైనా మంచి గుర్తింపు రావడం మాత్రం ఖాయమని వరుణ్‌తేజ్‌ని చూసి ఖచ్చితంగా చెప్పవచ్చు. మెగాబ్రదర్‌ నాగబాబు ఇప్పుడు మంచి పుత్రోత్సాహంతో ఉండి ఉంటాడనే భావించవచ్చు.

Varun Tej Pet Name Revealed:

Varun Tej Turns Yedhava for His Family

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement