Advertisementt

రామ్ నెక్స్ట్ చిత్ర దర్శకుడెవరో తెలుసా?

Mon 12th Feb 2018 05:31 PM
hero ram,praveen sattaru,director,new movie  రామ్ నెక్స్ట్ చిత్ర దర్శకుడెవరో తెలుసా?
Praveen Sattaru Directs Hero Ram రామ్ నెక్స్ట్ చిత్ర దర్శకుడెవరో తెలుసా?
Advertisement
Ads by CJ

లోబడ్జెట్‌ చిత్రాలతో పాటు హైబడ్జెట్‌తో రాజశేఖర్‌ హీరోగా 'పీఎస్వీ గరుడవేగ', కాస్త హాట్‌టచ్‌ ఇస్తూ 'గుంటూరు టాకీస్‌' ఇలా పలు విధాలుగా తనను తాను నిరూపించుకున్న యంగ్‌ టాలెంటెడ్‌ దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌. కాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని నితిన్‌ హీరోగా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలో మరో యంగ్‌ హీరో కూడా నటించడానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది. 'నేను శైలజ' తర్వాత హిట్‌ లేకపోయినా కూడా 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం ద్వారా మెప్పించిన రామ్‌ ప్రవీణ్‌ సత్తార్‌ చిత్రంలో నటించనున్నాడని సమాచారం. త్వరలో రామ్‌ 'సినిమా చూపిస్త మావా, నేను లోకల్‌' చిత్రాల దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ఓ చిత్రంలో నటించనున్నాడు. 

ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత వెంటనే రామ్‌ ప్రవీణ్‌ సత్తార్‌తో నటిస్తాడని సమాచారం. మరోవైపు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు హీరోగా పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కూడా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుంది. మరి నితిన్‌, రామ్‌, సుధీర్‌బాబుల చిత్రాలలో ఎవరి చిత్రం ముందుగా సెట్స్‌కి వెళ్తుందో ప్రవీణ్‌ సత్తార్‌ నోరు విప్పితే గానీ తెలియదు.

Praveen Sattaru Directs Hero Ram:

Hero Ram Movie in Praveen Sattaru Direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ