తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎంతో దగ్గర పరిచయం ఉన్న వ్యక్తిలా... అందరితో మైత్రితో కలుపుకుపోయే తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ సినిమా వాళ్లతో ఎంతో సన్నిహితంగాను దగ్గరగాను ఉంటాడు. సినిమా వాళ్ళ ఫంక్షన్స్ కి వచ్చివెళుతుండే కేటీఆర్ తనకి ఏదైనా సినిమా నచ్చితే దాన్ని ట్వీట్ రూపంలో మెచ్చుకోవడం అలవాటు. అయితే తాజాగా కేటీఆర్ వరుణ్ తేజ్ - వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన 'తొలిప్రేమ'ను మొదటి రోజు వీక్షించి ఈ సినిమాకి పాజిటివ్ ట్వీటేశాడు.
వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా వచ్చిన 'తొలిప్రేమ' సినిమా ఎంతో బావుందని... మనసుకు హత్తుకునేలా ఉందని కేటీఆర్ ట్వీట్ చెయ్యడమే కాదు.... దర్శకుడు వెంకీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని, టెరిఫిక్ మ్యూజిక్, లిరిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ తొలిప్రేమలో చాలా బాగున్నాయని కేటీఆర్ తొలిప్రేమను ఎత్తేస్తూ ట్వీట్ చెయ్యడమే కాదు... వరుణ్ తేజ్, రాశీఖన్నాల పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ అంటూ తన ట్వీట్ తో కేటీఆర్ తొలిప్రేమ చిత్ర బృందానికి బూస్ట్ ఇచ్చాడు.
ఇక కేటీఆర్ ట్వీట్ కి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందిస్తూ... సర్ మీరు తొలిప్రేమ సినిమా చూడడమే గాక.. సినిమాపై ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందని.. మా ఫేవరేట్ లీడర్ తొలిప్రేమను అభినందించడంతో మా సినిమా టీమ్ ఫుల్ హ్యాపీ అంటూ రీ ట్వీట్ చేసాడు.