సినిమా రంగం అనేది కూడా ఓ క్రియేటివ్ ఫీల్డ్. ఇది కూడా మిగిలిన పలు పోటీ రంగాల వంటిదే. ఇందులో నెగ్గేందుకు, తామనుకున్న స్థాయిని చేరుకునేందుకు ఎంతో కష్టపడాలి. ఎన్నో క్లిష్ట పరిస్థితులను, ఎత్తుపల్లాలను అధిగమించాలి. ఓటముల నుంచి నేర్చుకుని గెలుపులకు బాటలు వేసుకోవాలి. ఇక విషయానికి వస్తే ప్రతి ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెన్నడి స్కూల్ విద్యార్ధులకు ఏర్పాటు చేసే శిక్షణా తరగతులు, ఇండియన్ కాన్ఫరెన్స్‌కి ముఖ్య అతిధులుగా కొందరు విచ్చేసి విద్యార్ధులకు తమ అనుభవాలను తెలుపుతారు.
కిందటి ఏడాది ఈ వేదికకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ పవన్ చేసిన ప్రసంగం కూడా ఎంతో మంది పొగడ్తలను పొందింది. ఈ ఏడాది ఆ వేడుకకు టాలీవుడ్‌లో నుంచి బాలీవుడ్‌కి వెళ్లి సమాజంలోని పలు సమస్యలపై తన గళం విప్పుతోన్న హీరోయిన్ తాప్సిపన్ను వెళ్లి ప్రసంగించనుంది. మరి ఈమె ప్రసంగానికి ఎలాంటి స్పందన లభిస్తుందో వేచిచూడాల్సివుంది.