ఆమధ్య 'రంగస్థలం 1985' ఫస్ట్‌లుక్‌లో రామ్‌చరణ్ గల్లలుంగీ ధరించి అచ్చమైన పల్లెటూరి కుర్రాడిగా అదరగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన టీజర్ మొత్తం చిట్టిబాబు పాత్రధారి అయిన చిట్టిబాబు చుట్టూనే తిరిగింది. దీంతో తెలుగు సినిమాలలో హీరోలదే డామినేషన్ అని, హీరోయిన్ అయిన సమంతను అసలు చూపలేదని సమంతతో పాటు ఆమె అభిమానులు కూడా బాగా ఫీలయ్యారు. ఎట్టకేలకు ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిలా నటిస్తున్న రామలక్ష్మిగా సమంతను చూపిస్తూ కేవలం ఆమె మీదనే కట్ చేసిన టీజర్ తాజాగా విడుదలైంది. సాధారణంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో తప్పితే హీరోయిన్‌కి ఎంత ప్రాధాన్యం ఉన్నా కూడా హీరోయిన్ మీదనే టీజర్‌ని వదిలిన సంఘటనలు ఈమధ్య లేనే లేవనే చెప్పాలి.
ఇక బిందెను చంకన పెట్టుకుని సమంత అలియాస్ రామలక్ష్మి, అచ్చు పదహారాణాల పల్లెటూరి అమ్మాయిగా వయ్యారంగా నడిచి వస్తూ ఉంటే హీరో చిట్టిబాబు ఆమెని వర్ణిస్తుండటంతో ఈ టీజర్ మొదలైంది. అబ్బబ్చా ఏం వయ్యారం అంటూ మొదలైన టీజర్ సమంత బట్టలుతికే సీన్‌లో ముగిసింది. ఆ అమ్మాయిని సూత్తంటే మా ఊరికి 18 ఏళ్లు వచ్చినట్లు అనిపిస్తుందడీ అంటూ చిట్టిబాబు అదిరిపోయే గుండెతో మురిసిపోయిన డైలాగ్ సూపర్ అనే చెప్పాలి. సమంత తన అందంతో కట్టిపడేసింది. డీగ్లామరస్ పాత్రలో కూడా కవ్చించేట్లు సమంత అద్భుతంగా ఉంది. లంగాఓణిలో రెచ్చగొడుతూ, తన అందాలతో అచ్చు పల్లెటూరి పిల్లలా ఫిదా చేసేసింది. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం సుకుమార్ 'రంగస్థలం'తో ఏదో సంచలనం సృష్టించనున్నాడనే అనిపిస్తోంది.
చిట్టిబాబు, రామలక్ష్మిల పాత్రలు అంత అద్భుతంగా ఉంటాయా అని టీజర్‌ని చూస్తుంటేనే సినిమా మొత్తం చూడాలని ఆశ పుట్టడం ఖాయం. గ్రామీణ యువతుల్లోని అందాలను తెరపై రామలక్ష్మి పాత్ర ద్వారా చూపించడం అద్భుతం. అయితే ఈ టీజర్‌తో సమంత పాత్ర మూగదా? లేక మాటలు వచ్చా? అనేది మాత్రం దర్శకుడు సస్పెన్స్‌గానే ఉంచాడు. కథానాయిక కోసం ఇలాంటి టీజర్లు రిలీజ్ చేయరని నాకు తెలుసు. ఇది రామ్‌చరణ్, సుకుమార్‌ల వల్లే సాధ్యమైందని అర్ధమవుతోంది. థాంక్యూ వెరీ మచ్... అని సమంత తెలిపింది. ఇక ఈ చిత్రంలోని మొదటి పాటను ఈనెల 13న విడుదల చేయనున్నారు.