అమితాబచ్చన్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబై లోని ప్రముఖ హాస్పిటల్... లీలావతి లో జాయిన్ చేశారు. అయితే అమితాబ్ కి వెన్నుకింద భాగంలో నొప్పి ఎక్కువ ఉండడంతో ఆయనని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. పెద్దగా ప్రమాదం లేదని.. లుంబార్ (నడుము కింది భాగం) ప్రాంతంలో కొద్దిగా నొప్పిగా ఉన్నట్టుగా అమితాబ్ డాక్టర్స్ కి చెప్పగా వారు... కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఆయనని డిశ్చార్చి చేసి ఇంటికి పంపేశారు.
అంతేకాకుండా అమితాబ్ జీర్ణాశయ సమస్యతో పాటుగా మెడ, వెన్నెముక నొప్పితో కూడా బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ కొద్దిపాటి రెస్ట్ తో షూటింగ్స్ లో పాల్గొనొచ్చని కూడా వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అమితాబచ్చన్ ‘102 నాటౌట్’ అనే సినిమాలో నటిస్తుండగా... ఈ సినిమాని ఉమేశ్ శుక్లా డైరెక్ట్ చేస్తున్నాడు.