Advertisementt

రికార్డులు క్రియేట్ చేస్తున్న 'మెహబూబా' టీజర్..!

Sat 10th Feb 2018 04:42 PM
puri jagannadh,mehbooba,teaser,release,puri akash  రికార్డులు క్రియేట్ చేస్తున్న 'మెహబూబా' టీజర్..!
Mehbooba Teaser Terrific రికార్డులు క్రియేట్ చేస్తున్న 'మెహబూబా' టీజర్..!
Advertisement
Ads by CJ

పూరి ఆకాష్‌, పూరి జగన్నాథ్‌ల 'మెహబూబా' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రానికి సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రపద్రేశ్‌, యు.ఎస్‌.లలో 500 థియేటర్లలో ఈ టీజర్‌ విడుదలైంది. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుండి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పూరి జగన్నాథ్‌ కెరీర్‌లోనే డిఫరెంట్‌ మూవీగా 'మెహబూబా' తెరకెక్కుతోంది. సమ్మర్‌లో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఆకాష్‌ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Click Here For Teaser

 

Mehbooba Teaser Terrific:

Puri Jagannadh’s Mehbooba Teaser Rocks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ