ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Turns To Bikini to Traditional

నిన్న బికినీతో.. ఈరోజు లంగావోణీతో..!!

Samantha Turns To Bikini to Traditional

నిన్న గురువారం సమంత ఒక హాట్ బికినీ ఫోటోని పోస్ట్ చేసి అందరి నోరు తెరిపించింది. పనిలో బాగా అలసటగా ఉండడం వలన ఇలా చేశానని.. కావాలని సేదదీరడం లెదని చెప్పిన సమంత ఈ రోజు పరికిణి ఓణీ తో మత్తెక్కించేసింది. అలాగే రంగస్థలం షూటింగ్, మహానటీ షూటింగ్ తోపాటు తమిళంలోనూ షూటింగ్ లతో బిజీగా ఉన్న సమంత బీచ్ ఒడ్డున బికిని వేసుకుని లైట్ వెయిట్ బట్టలతో సేద తీరుతున్న ఫోటో చూసి చొంగ కార్చిన కుర్రకారు ఇప్పుడు రంగస్థలంలోని సమంత రామలక్ష్మి సాఫ్ట్ లుక్ తో మరికాస్త మతులు పోగొట్టుకుంటున్నారు.

డీ గ్లామర్ గా ఉన్నా కూడా అందంలో, నవ్వులో ఏమాత్రం తొణికిసలాడని సామ్ అంతే ఊర మాస్ గా కూడా కనబడుతుంది. రంగస్థలం టీజర్ లో వయ్యారాలు పోతూ నడుస్తున్న సమంత, సైకిల్ తొక్కుతున్న అల్లరి పిల్ల, అలాగే గడ్డి మోపు మోస్తున్న పేదింటి అమ్మాయిగానే కాదు బట్టలుతుకుతూ ఇచ్చిన మాస్ లుక్ ఉంది చూశారు అమ్మో... ఆ లుక్ లో సామ్ పరికిణి పైకి పెట్టి నడుం మీద చెయ్యేసుకుని తీక్షణంగా చూస్తున్న లుక్ ఉంది చూశారు... దాన్ని చూస్తుంటే అబ్బా సామ్ నిన్న బికినీతో రచ్చ చేస్తే ఈ రోజు పరికిణి ఓణీతో నరాలు మెలిపెట్టేసింది అంటున్నారు. మరి మీరు ఆ పిక్ ని ఓ లుక్ వెయ్యండి.

Samantha Trend Setter with Bikini and Traditional dress

samantha
trend setter
bikini
traditional
dress
rangasthalam