రామ్ చరణ్ - సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. నిన్నగాక మొన్న చిట్టిబాబు అంటూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లోను.. టీజర్ లోను చించి ఆరేస్తే... ఇప్పుడు రామలక్ష్మిగా సమంత అదరగొడుతుంది. రామ్ చరణ్ ని సోలోగా పెట్టి రంగస్థలం టీజర్ ని కట్ చేసిన సుకుమార్ ఇప్పుడు రామలక్ష్మి అంటూ సమంతని సోలోగా దించాడు. చిట్టిబాబుగా సౌండ్ ఇంజినీర్ గా రామ్ చరణ్ ని పక్కా మాస్ కాదు కాదు ఊర మాస్ మాదిరిగా లుంగీ, చొక్కా, కండువాతో మెగా ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తే... ఇప్పుడు సమంత రామలక్ష్మీగా పాతకాలపు పరికిణి ఓణీ, డొక్కు సైకిల్, తల మీద మొక్కజొన్న చొప్ప తో అదరగోట్టేసింది.
ఎప్పుడు అందంగా గ్లామర్ గా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సమంత... రంగస్థలం కోసం డి గ్లామర్ లుక్ లోకి మారినా ఆమె మొహంలో కళ గాని, నవ్వు గాని చెరగలేదు. ఎంత మేకప్ లేకపోయినా సమంత లుక్స్ చాలా బావున్నాయి రంగస్థలంలో. 1985 కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అలనాటి గురుతులు గుర్తుకు తెచ్చే విధంగా కనబడుతున్నాయి. అప్పట్లోని మోటార్ సైకిల్, అలాగే సైకిల్, దుస్తుల స్టయిల్ అబ్బో ఒకటేమిటి ఇంకా చాలానే ఉన్నాయి.
ఇకపోతే ఈ రంగస్థలం టీజర్ లో సమంత వయ్యారంగా తిప్పుకుంటూ బింది తీసుకొని నీళ్ల కోసం వెళుతుంటే... బ్యాగ్రౌండ్ లో చిట్టి అదేనండి రామ్ చరణ్.... 'ఓహోహో .. ఏం వయ్యారం ఏం వయ్యారం.. ఏమాటకామాటే సేప్పుకోవాలండి.. ఈ పిల్లేదురోత్తంటే మన ఊరికే పద్దెనిమిది సంవత్సరాలు వయసొచ్చినట్టు ఉంటదండి.... సైకిల్ మీద అలా అలా రామలక్ష్మి వస్తుంటే... మళ్ళీ బ్యాగ్రౌండ్ లో చిట్టి బాబు... ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెత్తించేసింది ఈ పిల్లేనండీ... పేరు రామలక్ష్మండి....ఊరు రంగస్థలమండి' అని చెబుతుంటే సమంత నవ్వుతుంది చూడండి గుండె లయ తప్పాల్సిందే. అలాగే టీజర్ చివర్లో సమంత బట్టలుతుకుతూ పెట్టిన ఫోజుంది చూడండి అమ్మో కేక.
మరి సుకుమార్ ఈసారి డిఫ్రెంట్ గా స్టయిల్ మార్చాడనేది పూర్తిగా అర్ధమయ్యింది. అలాగే దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనిపించేలా ఉంది. అలాగే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ఆ పాతకాలం లుక్ ని రిచ్ గానే చూపించాడు. మరి మార్చి 30 న మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు సాధార ప్రేక్షకుడికి కూడా ఈ సినిమా పండగ తెచ్చేలానే కనబడుతుంది.