Advertisementt

మాది ఖరీదైన ఉద్యోగమంటున్న హీరోయిన్!

Fri 09th Feb 2018 10:49 PM
radhika apte,padman,promotion,movies  మాది ఖరీదైన ఉద్యోగమంటున్న హీరోయిన్!
Radhika Apte Padman Promotion మాది ఖరీదైన ఉద్యోగమంటున్న హీరోయిన్!
Advertisement

లోకంలో అన్నింటికంటే సినిమా నటి అనేది బాగా ఆదాయం వచ్చే ఉద్యోగమని, ఈ రంగంలో చాలా మంది మా డిమాండ్‌కి, మా కష్టానికి తగ్గ రెమ్యూనరేషన్‌ ఇస్తారని అంటారని, కానీ తన దృష్టిలో ప్రపంచంలోకెల్లా అతి తక్కువ పనికి అతి ఎక్కువ పారితోషికం అందుకునే రంగం సినిమాలేనని గతంలో ఓ సారి వాణిశ్రీ నిజాయితీగా ఒప్పుకుంది. తాము కేవలం ప్రజల అభిమానిని క్యాష్‌ చేసుకుంటామని, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, క్రేజ్‌కి క్రేజ్‌ .. ఇలా అన్నింటిని సాధించేది నటీనటులేనని ఈ విషయంలో తామెంతో అదృష్టవంతులమని వాణిశ్రీ నాడు చెప్పుకొచ్చింది. 

ఇక తాజాగా 'కబాలి' ఫేమ్‌ రాధికా ఆప్టే తమ వృత్తిని మరో విధంగా నిర్వచించింది. ఆమె మాట్లాడుతూ, నటన అనేది ఖరీదైన ఉద్యోగం. అయితే అందాలను కాపాడుకోవడానికి, మేకప్‌లకు, అందంగా కనిపించడానికి, కాస్టూమ్స్‌కి, జిమ్‌ ట్రైనర్స్‌ వంటి వారిని పెట్టుకోవడానికి తమకు ఎంతో ఖర్చు కూడా అవుతుందని చెప్పుకొచ్చింది ఈ 'లెజెండ్‌' భామ. ఇక గత ఏడాది అంతా క్షణం తీరక లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చానని, అవన్నీ ఈ ఏడాది విడుదల కానున్నాయని తెలిపింది. కాస్త విరామం తీసుకుని కొత్త చిత్రాలను ఒప్పుకుంటానని తెలిపింది. ఇక తాను అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన 'ప్యాడ్‌మెన్‌' చిత్రం ఎంతో బాగా వచ్చిందని, ఇలాంటి మంచి చిత్రంలో తాను కూడా భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ పాత్రను అక్షయ్‌కుమార్‌ తప్ప మరెవ్వరూ చేయలేరని కితాబునిచ్చింది. 

ఈ చిత్రాన్ని బాల్కీ ఎంతో సున్నితంగా అద్భుతంగా తెరకెక్కించాడని ఆమె ప్రశంసలు కురిపించింది. ఇక మహిళలు రుతుస్రావం సమయంలో వాడే ఇలాంటి ప్యాడ్‌లను అతి తక్కువ ఖరీదుకి తయారుచేసి, వీటి వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించిన ప్రముఖ సామాజికవేత్త, తమిళనాడుకి చెందిన అరుణాచలం మురుగనాథం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని ప్రభుత్వం తరపున కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రమోట్‌ చేస్తోంది. ఈ చిత్రం తొలిసారిగా ఇండియాతో పాటు రష్యాలో కూడా ఒకే రోజున విడుదల కానున్న మొట్టమొదటి చిత్రంగా రికార్డులకెక్కుతోంది.

Radhika Apte Padman Promotion:

we have so many problems says Radhika Apte

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement