50 ఏళ్ల కిందట నాటి స్టార్ హీరో, నటుడు, బాలాజీ టెలిఫిల్మ్స్ చైర్మన్ జితేంద్ర తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఇప్పుడు కేసు నమోదు చేయాలని కోరుతుండటం చర్చనీయాంశంగా మారింది. నాడు ప్రసార సాధనాలు, మహిళల్లో చైతన్యం లేనందువల్ల ఆ కేసును ఇప్పుడు రిజిష్టర్ చేసి జితేంద్రను అరెస్ట్ చేయాలని ఓ మహిళ కోరుతుండగా చట్టం ప్రకారం 50ఏళ్ల కిందటి కేసుపై ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చా? లేదా? అన్న పాయింట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ మహిళ చెప్పిన ప్రకారమే ఇప్ప్పుడు కేసును నమోదు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి అనేక ఆరోపణలు మరిన్ని వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం 1971లో ఓ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు జితేంద్ర ఆమెని కారులోకి ఎక్కించుకుని ఓ బంగ్లాకి తీసుకెళ్లాడు. అక్కడ రెండు విడి విడి బెడ్స్ ఉన్నాయి. ప్రయాణబడలిక వల్ల తాను ఆ బెడ్‌పై నిద్ర పోయి తెల్లవారు జామున హఠాత్తుగా మెలకువ వచ్చి చూస్తే తన బెడ్‌పై జితేంద్ర ఉన్నాడు. ఆయన నుంచి మద్యం వాసన వస్తోంది. దాంతో ఆయన మద్యం తాగి ఉన్నాడని ఆ మహిళ గుర్తించింది. జితేంద్ర ఆమెపై అత్యాచారం చేసి అక్కడే ఆమెని వదిలి వెళ్లిపోయాడు. దాంతో తాను ఆ రాత్రి అక్కడే ఉండి పోవాల్సివచ్చిందని ఆ మహిళ హిమాచల్ ప్రదేశ్ డిజికి లేఖ రాసింది.
దీనిని జితేంద్ర తరపు న్యాయవాది కొట్టి పారేశారు. తన క్టైంట్‌పై ఆమె 50ఏళ్ల తర్వాత కంప్లైంట్ చేస్తోందని, దీనిని పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ నమ్మే అవకాశం లేదని జితేందర్ తరపు న్యాయవాది పేర్కొన్నాడు. ఆన్‌లైన్ ద్వారా తమకు ఫిర్యాదు అందిందని, కేసును నమోదు చేసేది లేదని పరిశీలిస్తామని ఎస్పీ మీడియాకు తెలిపాడు.