టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి నిన్నమొన్నటి స్పైడర్ వరకు అన్ని గ్లామర్ పాత్రలే చేసిన రకుల్ ప్రీత్ సింగ్ కి కేవలం 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో మాత్రమే నటనకు స్కోప్ ఉన్నపాత్ర దొరికింది. రామ్ చరణ్ పక్కన 'ధృవ' సినిమాలో అయితే అందాల ఆరబోతలో రకుల్ ప్రీత్ కి మించిన వారు లేరన్నారు. అందులోని పరేషాను రా అనే పాటలో రకుల్ తడిసిన అందాలకు అంటా ఫిదా అయిపోయారు. అయితే కేవలం టాలీవుడ్ లో తనకు గ్లామర్ పాత్రలే వస్తున్నాయని రకుల్ అప్పుడప్పుడు వాపోయేది. ఇక కోలీవుడ్ లో కూడా రకుల్ కి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం సౌత్ లో సూర్య పక్కన వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ కి తెలుగులో అస్సలు సినిమాలే లేవు.
కానీ బాలీవుడ్ లో అమ్మడు ఈ మధ్యన అడపా దడపా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ నటించిన 'అయ్యారి' సినిమా ఫిబ్రవరి 14 న విడులవుతుంది. అమ్మడు బాలీవుడ్ లో ఎలాగైనా పాతుకుపోవాలని... లక్కున్నప్పుడే చక్కబెట్టేయ్యాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్ మీద బాగానే దృష్టి పెట్టింది. అందులో భాగంగా రకుల్ ఈ మధ్యన బాగా వర్కౌట్స్ చేసి సన్నగా నాజూగ్గా.. జీరో సైజ్ కి వచ్చేసింది. అయితే ఇలా ఎందుకు తగ్గిందో అనేది జనాలకు పూర్తిగా నిన్న రకుల్ పోస్ట్ చేసిన మాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజీ చూసే వరకు తెలియలేదు. బాలీవుడ్ లోకి అడుగెట్టి అడుగెట్టగానే అమ్మడు హాట్ హాట్ ఫోజులతో మ్యాగజైన్ కవర్ పేజీల మీదకెక్కి రచ్చ మొదలెట్టేసింది. మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం మ్యాగ్జిమమ్ బట్టలు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది.
వైట్ బికినీతో కాళ్ళు మొత్తం కనిపించేలా ఎక్సపోజింగ్ చేస్తూ క్లివేజ్ అందాలతో... అందరిని రెచ్చగొడుతూ మత్తెక్కించే చూపులతో కుర్రకారుకి గేలం వేస్తుందా అన్నట్టుగా రకుల్ ప్రీత్ ఫోజులు ఉన్నాయి. అసలు బాలీవుడ్ కి అలా అడుగెడతారో లేదో ఇలా అందాల ప్రదర్శనకు ఒకే చెప్పేస్తారు భామలు. మరి రకుల్ ప్రీత్ కూడా అక్కడ నిలబడాలి అంటే ఆ మాత్రం ఆరబోయాలని తొందరగానే తెలుసుకుందనుకుంటా!.. అందుకే ఇలా మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం మొత్తం విప్పేసి అదిరిపోయే ఫోజులిచ్చింది. మరి ఈ లెక్కన తాను బాలీవుడ్ లో గ్లామర్ షోకి పూర్తిగా సిద్ధంగా వున్నానని.... దర్శకనిర్మాతలకు తెలియజెప్పింది రకుల్.