Advertisementt

ఇక పూజా హెగ్డేని పట్టుకోగలరా..!

Thu 08th Feb 2018 12:55 PM
pooja hegde,romance,mahesh babu,prabhas,ram charan,allu arjun,dj,ntr  ఇక పూజా హెగ్డేని పట్టుకోగలరా..!
Pooja to Romance Three Big Heroes! ఇక పూజా హెగ్డేని పట్టుకోగలరా..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ తో 'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమాలో హాట్ హాట్ గా రెచ్చిపోయిన పూజా హెగ్డేకి సుడి తిరిగినట్లేనా? అంటే అవుననే అంటున్నారు. అల్లు అర్జున్ సరసన అదిరిపోయే స్టెప్పులు వేసి, అలాగే నాభి అందాలతో పాటే... స్విమ్మింగ్ ఫూల్ దగ్గర తడి తడి అందాలతో రెచ్చిపోయి గ్లామర్ షో చేసిన పూజాని డీజే సినిమా హిట్ తో.. కోటి రూపాయలకు బెల్లంకొండ శ్రీనివాస్ కోసం బెల్లంకొండ సురేష్.. పూజాని 'సాక్ష్యం'లో నటింపజేస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే మరోపక్క వంశీ పైడిపల్లి - మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హాట్ అందాలు ప్రధాన ఆకర్షణ అంటున్నారు. దీనితోనే పూజా హెగ్డే సుడి తిరిగింది అనుకుంటే... ప్రస్తుతం పూజా కి మరో రెండు స్టార్ హీరోల సినిమాలు కూడా తలుపు తట్టేలా కనబడుతున్నాయి.

అందులో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే పేరుని ఫైనల్ చేసే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ముందుగా ఎన్టీఆర్ సరసన అను ఇమ్మాన్యుయేల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ తో అనుని తప్పించి ఆ ప్లేస్ లోకి పూజా హెగ్డేని అనుకున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదుగాని... దాదాపుగా ఎన్టీఆర్ పక్కన స్టెప్పులు వేసి రొమాంటిక్ గా రెచ్చిపోయేది మాత్రం పూజానే అంటున్నారు. అలాగే పూజాకి మరో బిగ్ ఆఫర్ కూడా తగిలింది అంటున్నారు. 

ఈ ఆఫర్ అయితే అలాంటి ఇలాంటి ఆఫర్ కాదండోయ్.... ఏకంగా బాహుబలి ప్రభాస్ పక్కన పూజా హెగ్డే అవకాశం కొట్టేసిందని అంటున్నారు. ప్రస్తుతం సాహో సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ తో నటిస్తున్న ప్రభాస్  ఆతర్వాత రాధాకృష్ణ దర్శత్వంలో నటించబోయే సినిమాలో పూజా హెగ్డే తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటాడనే టాక్ వినబడుతుంది. మరి ఇలా వరుసగా ముగ్గురు బడా స్టార్స్ తో పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది అంటే... ఆమె సుడి ఎలా ఉందో అర్ధమవుతుంది. పాపకి డీజే లో చేసిన గ్లామర్ షో మాత్రం బాగా పనికొచ్చిందనేది ఈ అవకాశాలను చూస్తుంటేనే తెలుస్తుంది.

Pooja to Romance Three Big Heroes!:

Pooja Opposite Mahesh, NTR and Prabhas?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ