రామ్ చరణ్ రంగస్థలం చిత్రం చిత్రీకరణ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం సమాయత్తమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం తోపాటు.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పక్కా మాస్ మూవీలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా రెండో షెడ్యూల్ కోసం బోయపాటి అండ్ టీమ్ రెడీ అవుతుంది. అయితే బోయపాటి ఊర మాస్ సినిమాలను తెరకెక్కిస్తాడు. మరి అంత ఊర మాస్ యాక్షన్ మూవీగా చరణ్ సినిమాని తెరకెక్కించొద్దని.. ఆ సినిమాలో కామెడీకి పెద్ద పీటవెయ్యమని స్వయంగా మెగాస్టార్ చిరునే బోయపాటికి సూచించాడనే ప్రచారం జరిగింది.
ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ, మహేష్ హీరోయిన్ అయిన కైరా అద్వానీతో రొమాన్స్ చేస్తున్న రామ్ చరణ్ కి ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు అన్నలు ఉంటారట. అయితే అందులో చరణ్ కి పెద్దన్నయ్య గా తమిళ స్టార్ హీరో ప్రశాంత్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ న్యూస్ అధికారికంగా వినబడుతుంది. అయితే ఇప్పుడు చిన్న అన్నయ్యగా మరో తెలుగు హీరో కనిపించనున్నాడని చెబుతున్నారు. అతనెవరో కాదు అందాల రాక్షసి, త్రిపుర సినిమాల హీరో నవీన్ చంద్ర. రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో చిన్న అన్నయ్యగా నవీన్ చంద్ర కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కేవలం అవకాశం మాత్రమే కాదు... నవీన్ చంద్ర, చరణ్ అన్నయ్యగా కన్ఫర్మ్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ చేస్తుండగా.. చరణ్ కి వదిన పాత్రలో.. ప్రశాంత్ భార్యగా స్నేహ చేస్తుండటం విశేషం.