సీనియర్ హీరో కృష్ణంరాజుకి మైలురాయిగా నిలిచిన చిత్రం 'భక్త కన్నప్ప'. అయితే ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఏమి దానికి సంబంధించి ఒక్క న్యూస్ కూడా బయటికి రాలేదు. అప్పట్లో తనికెళ్ల భరణి ‘కన్నప్ప’ స్క్రిప్టు రెడీ చేశాడు. ఆ సినిమా చేయడానికి మంచు విష్ణు ముందుకు వచ్చాడు.
కొన్ని వివాదాల కారణంగా ఆ మూవీ ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆ మూవీ పట్టాలు ఎక్కనుంది. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నాడు మంచు విష్ణు అలానే ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
‘కన్నప్ప’ సినిమాను రూ.70-80 కోట్ల మధ్య బడ్జెట్లో తెరకెక్కించనున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. అంత బడ్జెట్ ఎక్కువ అని తెలిసిన కానీ.... మొండి ధైర్యంతో రంగంలోకి దిగబోతున్నామని విష్ణు చెప్పాడు. నాకు ప్రస్తుతం అంత మార్కెట్ లేదు..కానీ నెక్స్ట్ చేస్తున్న సినిమాలు రిలీజ్ అయ్యాక తన మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుందని అతనన్నాడు. తనికెళ్ల భరణితో పాటు రచయిత సాయిమాధవ్ బుర్రా కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని చెప్పాడు. ఈ చిత్రాన్ని ఒక హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని.. ఆ దర్శకుడెవరన్నది త్వరలో ప్రకటిస్తామని విష్ణు తెలిపాడు.