ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా వస్తే ఆశ్చర్యపోయేవారు. నేడు బ్రహ్మీ ఉంటే ఆశ్యర్యపోతున్నారు. ఇక ఈయన ప్రస్తుతం 'ఇంటెలిజెంట్, గాయత్రి' త్వరలో విడుదలకు సిద్దమవుతున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాలలో చేస్తున్నాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ, గత 25ఏళ్లుగా నేను సినిమాలే చూడటం లేదు. ఓ సారి థియేటర్‌కి స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లితే, అందులో హీరో భగ్నప్రేమికుడిగా, మందు తాగుతూ పాట పాడుతూ దగ్గుతుంటాడు. అప్పుడు మా సీటు పక్కనే ఉన్న వ్యక్తి దగ్గుతూ పాడటం దేనికి? డాక్టర్ వద్దకు వెళ్లవచ్చు కదా అన్నాడు.
అలా సినిమాలలో సహజత్వం లేదని అర్దం చేసుకుని సినిమాలు చూడటం మానివేశాను. డైలాగ్స్ చెప్పేటప్పుడు వెనుక మ్యూజిక్ వినిపించడం, అందరకు ఒకే డ్రస్‌లు వేసుకుని డ్యాన్స్‌లు చేయడం అన్నీ అసహజంగా ఉంటాయని అన్నాడు. మరి ఆయన ఏ చిత్రాలు చూడకపోతే ఆయా చిత్రాలలోని స్పూర్ఫ్‌లు ఎలా చేశాడు? అనేది ప్రశ్న. ఇక ఈయన షూటింగ్‌లో ఉంటే అది షూటింగ్‌లా ఉండదని, ఏదో పిక్నిక్‌లాగా వాతావరణం ఉంటుందని అంటారు. ఆయన వేసే సెటైర్లు, చమత్కారాలు అందరినీ అంతలా నవ్విస్తాయట.
ఇక తాజాగా ఆయనకు హీరోల కాంపౌండ్‌కి సంబంధించిన గొడవలు మీకేమి ఇబ్బంది కలిగించలేదా? అని ప్రశ్న ఎదురైతే ఇల్లే లేదు. ఇక కాంపౌండ్‌తో పనేముంది. అయినా మన నాలుకను అదుపులో పెట్టుకుంటే ఎలాంటి చికాకులు దరిచేరవు అంటూ తనదైన శైలిలో చమత్కరించడంతో విన్నవారికి నవ్వాగలేదని అంటున్నారు.