Advertisementt

అల్లు అర్జున్ నిర్మాతలకు 6 కోట్ల లాస్..!

Tue 06th Feb 2018 09:50 PM
allu arjun,6 crores loss,naa peru surya naa illu india,hindi dubbing rights  అల్లు అర్జున్ నిర్మాతలకు 6 కోట్ల లాస్..!
6 crores Loss to Allu Arjun Naa Peru Surya Naa Illu India అల్లు అర్జున్ నిర్మాతలకు 6 కోట్ల లాస్..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఎప్పుడూ కొత్తవారిని ఎంకరేజ్ చేస్తాడని అనడమే కాదు నిజంగానే కొత్త కొత్త దర్శకులను నమ్మి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు. ఇప్పుడు కూడా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమాతో రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా లాంచ్ చేస్తున్నాడు. బన్నీ - వక్కంతం కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దేశభక్తి నేపథ్యంలో ఉన్న ఈ కథలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా డిఫరెంట్ లుక్ తో కనబడుతున్నాడు. ఈ సినిమాలో గ్లామర్ భామ అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ చేస్తున్నాడు బన్నీ.

ప్రస్తుతం నా పేరు సూర్య షూటింగ్ కి కొద్దిగా బ్రేక్ పడినప్పటికీ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమాని విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే ఊపందుకుంది. ప్రస్తుత కాలంలో ఒక స్టార్ హీరో సినిమా అంటే బిజినెస్ కూడా ఒక రేంజ్లోనే జరుగుతుంది. ఆ సినిమా యొక్క ఓవర్సీస్ బిజినెస్, శాటిలైట్ బిజినెస్, అలాగే డిజిటల్ రైట్స్ ఇలా ఆయా సినిమా బిజినెస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. వీటికి తోడు స్టార్ హీరో సినిమాలకు హిందీ రైట్స్ విషయంలోనూ భారీ డిమాండ్ ఉంది. అయితే హిందీ హక్కులు తీసుకున్న వారు ఆ సినిమాని థియేటర్లు లో ఆడించకపోయినా టివి ఛానల్స్ లో మాత్రం వాటికీ విపరీతమైన డిమాండ్ ఉంది.

అయితే హిందీ డబ్బింగ్ హక్కుల విషయంలో విపరీతమైన డిమాండ్ అల్లు అర్జున్ కి ఉంది. సరైనోడు సినిమాతో హిందీ డబ్బింగ్ హక్కుల విషయంలో బన్నీకి విపరీతమైన డిమాండ్ వచ్చిపడింది. అందులో భాగంగానే నా పేరు సూర్య అలా మొదలయిందో లేదో ఒక బడా కంపెనీ హిందీ రైట్స్ విషయంలో మంచి ఆఫర్ ఇచ్చేసింది. దానితో నా పేరు నిర్మాతలు సినిమా మొదలవ్వగానే ఇంత డిమాండ్ వచ్చేసిందని సంతోషంలో నా పేరు సూర్య హిందీ రైట్స్ ని 12 కోట్లకు అమ్మేశారు. కానీ ఇప్పుడు నా పేరు సూర్య ప్రమోషన్ ని మొదలెట్టేసరికి హిందీ డబ్బింగ్ హక్కులకు మరింత డిమాండ్ ఏర్పడింది. మరింత అంటే దాదాపుగా 18 కోట్లకు నా పేరు సూర్య హిందీ రైట్స్ కి డిమాండ్ వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఇప్పుడు నా పేరు సూర్య నిర్మాతలు దాదాపు 6 కోట్ల మేర నష్టపోయామని దిగులు పడుతున్నారట.

6 crores Loss to Allu Arjun Naa Peru Surya Naa Illu India:

Hindi dubbing rights- 6 cr Loss for Naa Peru Surya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ