వరసబెట్టి రెండు సినిమాలు 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' డిజాస్టర్ కావడంతో మహేష్ తన నెక్స్ట్ మూవీ 'భరత్ అనే నేను' పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అలానే వంశీ పైడిపల్లి ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ పై మహేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడని అంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే...లేటెస్ట్ గా బోయపాటి.. మహేష్ కు ఓ సబ్జెక్టు చెప్పాడంట. కథ విన్న వెంటనే నచ్చలేదని మొహం మీద చెప్పేశాడట. ప్రస్తుతం వినిపించిన కథకు రిపేర్లు చేసే ప్రయత్నాలు చేయకుండా, కొత్తగా ఏదైనా లైన్ అనుకుని రమ్మని చెప్పాడట. దానితో బోయపాటి.. మహేష్ కు కొత్త కథ రాసే అలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
కొన్ని నెలలు క్రితం బోయపాటి.. మహేష్ కు ఓ కథ చెప్పాడు అది కూడా మహేష్ కు నచ్చలేదు. మల్లి ఇప్పుడు అదే రిపీట్ అయింది. మరి ఈసారి బోయపాటి ఎటువంటి కథను తీసుకెళ్లి మెప్పిస్తాడో చూడాలి. ఇలా మహేష్ కథ నచ్చలేదని మొహం మీద చెప్పడానికి కారణం మాత్రం తన రెండు సినిమాలు డిజాస్టర్ అవ్వడం వల్లనే అని చెబుతున్నారు.