Advertisementt

లారెన్స్ భేషైన నిర్ణయం తీసుకున్నాడు!

Tue 06th Feb 2018 07:03 PM
raghava lawrence,fans,not come,pictures,fan dies,tragically  లారెన్స్ భేషైన నిర్ణయం తీసుకున్నాడు!
Raghava Lawrence's biggest fan dies tragically లారెన్స్ భేషైన నిర్ణయం తీసుకున్నాడు!
Advertisement
Ads by CJ

మన అభిమానులను మన హీరోలు ఎలా ట్రీట్‌ చేస్తారో తెలియదు గానీ కోలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం అభిమానులకు ఎంతో గౌరవం ఇస్తారు. రజనీకాంత్‌, సూర్య, కార్తి, రాఘవలారెన్స్‌ నుంచి అందరు అదే కోవకి చెందుతారు. సూర్య అభిమానుల కాళ్లకు నమస్కారం చేయడం, తన చిత్రం సక్సెస్‌మీట్‌ సందర్భంగా హెల్మెట్‌ కూడా పెట్టుకోకుండా తన కారు కింద పడబోయిన అభిమానులకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఇటీవల తన అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కార్తి అతని అంత్యక్రియలకు వెళ్లి సొంత మనిషిని పోగొట్టుకున్న వాడిలా బోరున ఏడ్చిన ఘటన మరువక ముందే కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌, హీరో అయిన తమ అభిమాన రాఘవలారెన్స్‌తో ఫొటో దిగాలని శేఖర్‌ అనే అభిమాని వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 

దాంతో లారెన్స్‌ తీవ్ర కలతకు గురయ్యాడు. ఆయన ఆ అభిమాని అంత్యక్రియలకు హాజరవ్వడమే కాదు.. ఇకపై అభిమానులు ఎవ్వరూ నాతో ఫొటోలు తీసుకోవడానికి రావద్దు. నేనే సమయం దొరికినప్పుడల్లా మీ వద్దకే వచ్చి ఫొటోలు దిగుతాను. ఈనెల 7వ తేదీన సేలం వచ్చి నా అభిమానులతో ఫొటోలు దిగుతాను. శేఖర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని చెబుతూ, తన అభిమాని శేఖర్‌ ఫొటోని పోస్ట్‌ చేసి తన పెద్ద మనసు నిరూపించుకున్నాడు.

Raghava Lawrence's biggest fan dies tragically:

FANS NEED NOT COME FOR PICTURES - I WILL GO TO THEM, SAYS RAGHAVA LAWRENCE

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ