Advertisementt

త్రిషకి అలా జరగడానికి కారణం ఆమె కాదంట!

Tue 06th Feb 2018 01:48 PM
keerthy suresh,not responsible,saamy 2 movie,trisha,ouster  త్రిషకి అలా జరగడానికి కారణం ఆమె కాదంట!
Keerthy Not Responsible For It త్రిషకి అలా జరగడానికి కారణం ఆమె కాదంట!
Advertisement
Ads by CJ

నేడు దక్షిణాదిలో ఉన్న అప్‌కమింగ్‌ స్టార్‌ హీరోయిన్లలో కీర్తిసురేష్‌ ఒకరు. పవన్‌ 'అజ్ఞాతవాసి' దెబ్బ వేయకుండా ఉండి ఉంటే ఇప్పటికే ఈమె తెలుగులో కూడా వరుసగా స్టార్స్‌తో చాన్స్‌లు కొట్టేసేదే. ఇక ఆమె తమిళంలోకి 'ఇదు ఎన్న మాయం' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత శివకార్తికేయన్‌తో నటించిన 'రజనీమురుగన్‌'తో మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ధనుష్‌, విజయ్‌, సూర్య వంటి స్టార్స్‌తో జతకట్టింది. విజయ్‌ నటించిన 'భైరవ' చిత్రంలో కూడా ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా గ్లామర్‌షోకి నో చెప్పినా కూడా విజయ్‌ మరోసారి మురుగదాస్‌తో చేసే హ్యాట్రిక్‌ మూవీలో మరలా కీర్తిసురేష్‌నే పెట్టుకున్నాడు. 

ఇక ఈమె తన చిరకాల కోరిక అయిన సూర్యతో నటించే అవకాశాన్ని కూడా 'గ్యాంగ్‌'తో అందుకుంది. ప్రస్తుతం ఈమె తమిళంలో సండకోళి2, సామి2, మహంతి చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈమె 'సామి 2'లో త్రిషతో కలిసి నటించాల్సి ఉంది. కానీ ఈ చిత్రంలో తనకంటే ఎక్కువ సీన్స్‌ కీర్తిసురేష్‌కి ఉన్నాయని చెప్పి త్రిష ఆ చిత్రం నుంచి అర్ధాంతరంగా వైదొలగిందని కోలీవుడ్‌ మీడియా అంటోంది. అయితే ఇందులో కీర్తిసురేష్‌ తప్పూ ఏమీ కనిపించడం లేదు. దర్శకనిర్మాతలు, హీరోల చేతిలో ఉండే అంశం గురించి కీర్తిసురేష్‌ని తప్పు పట్టనవసరం లేదు. తాజాగా కీర్తిసురేష్‌ మాట్లాడుతూ, ఆ చిత్రంలో త్రిషతో నాకు కాంబినేషన్‌ సీన్లే లేవు. 

మరి త్రిష ఆ చిత్రం నుంచి తప్పుకోవడానికి నేనెలా కారణం అవుతాను? అయినా సీన్స్‌ ఎక్కువ లేవనే చిన్న విషయం వల్ల త్రిష అందులోంచి తప్పుకుందని, ఆమె అంత సిల్లీగా ఆలోచిస్తుందని నేను అనుకోవడం లేదు. నిజంగా నాకు ఆ సమస్య ఏమిటో తెలియదు. మరి దాని గురించి నేనెలా మాట్లాడుతాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈమె నటిస్తున్న 'మహానటి' చిత్రం మార్చి నెలలో తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా విడుదల కానుంది.

Keerthy Not Responsible For It:

Keerthy says she is not responsible for Trisha's ouster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ