Advertisementt

నిత్యా.. బాలయ్యకి నో చెప్పింది..!

Mon 05th Feb 2018 01:49 PM
nithya menen,balakrishna,ntr biopic,basavatarakam role  నిత్యా.. బాలయ్యకి నో చెప్పింది..!
Nithya Menon rejected Basavatarakam role in NTR biopic నిత్యా.. బాలయ్యకి నో చెప్పింది..!
Advertisement
Ads by CJ

ఓ సినిమా వేడుకకు ముఖ్యఅతిధిగా వచ్చిన బాలకృష్ణ నిత్యామీనన్‌ని ఉద్దేశించి ఈమె కనుక కాస్త హైట్‌ ఉండి ఉంటే తాను తీయాలనుకుని ఆగిపోయిన 'నర్తనశాల'లో దౌపద్రి పాత్రకు నిత్యాను తీసుకునే వాడినని వేడుకలోనే చెప్పాడు. ఇక నిత్యా గ్లామర్‌ పాత్రలు చేయకపోయినా ఆమె నటించిందంటే ఆ పాత్రలో ఎంతో వైవిధ్యం ఉంటేనే ఒప్పుకుంటుంది. తాజాగా ఆమె నాని 'అ!' వేడుకకు వచ్చినప్పుడు అసలే పొట్టి మీద బాగా బరువు పెరిగి కాస్త ఆశ్యర్యం కలిగించింది. ఇక ఈ పాత్రను నిత్యా తప్పితే ఎవ్వరూ చేయరని నాని చెప్పాడు. 'అ!' చిత్రంలో నిత్యా చేస్తున్న పాత్ర లెస్బియన్‌ అనే వార్త ప్రచారంలో ఉంది. అలా పాత్ర నచ్చితే ఎలాంటి దానికైనా ఆమె ఓకే చెబుతుంది. 

కానీ తాజాగా తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రని నిత్యామీనన్‌ని చేయమని అడిగారట. మొదట ఓకే అని చెప్పిన ఆమె తర్వాత నో చెప్పిందని సమాచారం. ఆమె నో చెప్పిందంటే రెండే రెండు కారణాలు ఉంటాయి. పాత్రకు సినిమాలో ప్రాధాన్యం లేకపోవడం, లేదా యూనిట్‌లోని వారితో చేయడం నచ్చకపోవడం, మరి ఈమె బాలయ్య, తేజల మీద ఇండస్ట్రీలో వినిపించే మాటలు, గతంలో మరో మలయాళనటి మీరాజాస్మిన్‌ వ్యవహారంలో బాలయ్య గొడవ వంటి వాటి నేపధ్యం, దర్శకునిగా తేజ కాస్త అతి చేస్తాడనే వార్తల వల్లనే ఆమె నో చెప్పిందని అంటున్నారు. మొత్తానికి ఆమె బసవతారకం పాత్రకి నో చెప్పడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Nithya Menon rejected Basavatarakam role in NTR biopic:

Nithya Menen rejected Balakrishna's offer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ