పవన్ తన కెరీర్ మొదట్లో ఈవీవీ సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య వంటి వారితో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత అరుణ్‌ప్రసాద్, కరుణాకరన్, ఎస్.జె.సూర్య, ధరణి, వీరశంకర్, బాబి, డాలీ... ఇలా సాధారణ దర్శకులతో చేశాడే గానీ బి.గోపాల్, వినాయక్, బోయపాటిశ్రీను, సుకుమార్, రాజమౌళి వంటి స్టార్ దర్శకులతో మాత్రం ఆయన సినిమాలు చేయలేదు. తమిళం నుంచి వచ్చిన ధరణి, విష్ణువర్దన్, ఎస్.జె.సూర్యలకి ఇచ్చిన ప్రాధాన్యం మన వారికి పవన్ ఇవ్వలేదనే చెప్పాలి. ఆయన పనిచేసిన టాప్ డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ తప్ప మరొకరు లేరనే చెప్పాలి. ఇక తెలుగులో వినాయక్‌ది స్పెషల్‌స్టైల్. ఆయన హీరోని, హీరోయిజాన్ని ఎంతో పీక్స్‌లో చూపిస్తాడు. తన మొదటి చిత్రం 'ఆది'తోనే ఎన్టీఆర్‌కి విపరీమైన మాస్ ఫాలోయింగ్‌ని తెచ్చాడు. ఇక అల్లుఅర్జున్‌తో 'బన్నీ', చిరంజీవితో 'ఠాగూర్, ఖైదీనెంబర్ 150', నితిన్‌తో 'దిల్', ఎన్టీఆర్‌తో 'సాంబ, అదుర్స్' ఇలా తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు.
ఇక ఆయన నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్‌లతో చిత్రాలు చేసినా ఆయా చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్స్‌గానే మిగిలాయి. ప్రస్తుతం ఆయన సాయిధరమ్‌తేజ్ హీరోగా 'ఇంటెలిజెంట్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం 9వ తేదీన విడుదల కానుంది. నితిన్‌కి 'దిల్'లా సాయికి 'ఇంటెలిజెంట్' అవుతుందనే నమ్మకంతో నిర్మాత సి.కళ్యాణ్ తేజు మార్కెట్‌ని మించి 32 కోట్ల బడ్టెట్ ఖర్చుపెట్టాడు. ఇక తాజాగా వినాయక్ మాట్లాడుతూ, సాయిధరమ్‌తేజ్‌తో చిత్రం చేయాలని 'ఖైదీనెంబర్ 150' టైంలోనే నిర్ణయించుకున్నాను. ప్రతి హీరోలో ఓ ప్రత్యేకత ఉంటుంది. మనం తయారు చేసుకునే కథకు తగ్గట్లుగా హీరోల ఎంపిక ఉంటుంది. ప్రతి హీరో కష్టపడి చేస్తాడు' అని చెప్పుకొచ్చాడు.
ఇక పవన్‌తో సినిమా ఉంటుందా? అని ప్రశ్నిస్తే పవన్‌తో సినిమా ఎప్పుడు చేస్తానని నేను చెప్పలేను. దానిని టైం డిసైడ్ చేయాలి అని చెప్పుకొచ్చాడు. మరోవైపు పవన్ మైత్రిమూవీస్‌కి ఓ సినిమా చేయడానికి ఒప్పుకుని 15కోట్ల వరకు అడ్వాన్స్ తీసుకున్నాడని, పవన్ ఇప్పుడు తమ సినిమా చేసే పరిస్థితి లేకపోవడంతో వడ్డీతో కలిపి తమకి 20కోట్లు చెల్లించాలని మైత్రిమూవీమేకర్స్ సంస్థ పవన్‌కి నోటీసులు పంపడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పవన్ స్పందన ఏమిటో వేచిచూడాల్సివుంది...!