Advertisementt

'రంగస్థలం 1985' గురించి సమంత క్లారిటీ!

Mon 05th Feb 2018 12:15 PM
rangasthalam,ram charan,samantha,crucial,updates  'రంగస్థలం 1985' గురించి సమంత క్లారిటీ!
Samantha's Update on Rangasthalam 'రంగస్థలం 1985' గురించి సమంత క్లారిటీ!
Advertisement
Ads by CJ

ఎప్పుడో విడుదల కావాల్సిన 'రంగస్థలం 1985' చిత్రం షూటింగ్‌ ఇంకా సాగుతూనే ఉంది. ఈ చిత్రం ఆలస్యం కావడానికి నిదానంగా చిత్రాలను తీసే దర్శకుడు సుకుమార్‌తో పాటు సమంత కూడా కారణమేనని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి రావాల్సిన చిత్రం మార్చి30కి పోస్ట్‌పోన్‌ అయింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద స్టార్స్‌ చిత్రాల హంగామా సద్దుమణిగింది. ఇక నుంచి థియేటర్లలోకి వచ్చే సినిమాలన్నీ మీడియం, లోబడ్జెట్‌ చిత్రాలే, మరలా పెద్ద చిత్రాల రాక మార్చి30 రామ్‌చరణ్‌-సుకుమార్‌ల 'రంగస్థలం 1985' తో మొదలుకానుంది. అక్కడి నుంచి వరుసగా పెద్ద చిత్రాలు ధియేటర్లలోకి రానున్నాయి. 

ఇక ఈ చిత్రం గురించి తాజాగా సమంత మెగాభిమానులు సంతోషించే విషయాన్ని చెప్పింది. రంగస్థలం షూటింగ్‌ ముగిసింది. ఇలాంటి స్పెషల్‌తో జర్నీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. రామ్‌చరణ్‌, సుకుమార్‌ వంటి స్టార్స్‌ అంతా తమ బిరుదులకు తగ్గట్లు మెరిసిపోయారు... అని చెప్పుకొచ్చింది. సమంత నుంచి ఈ స్వీట్‌ న్యూస్‌ విన్న మెగాభిమానులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. మార్చి 30 కోసం, అంతకు ముందు వచ్చే ట్రైలర్‌, ఆడియో వంటి వాటి కోసం ఇప్పటినుంచే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సమంత ఎన్నో ప్రత్యేకతలు నిండిన చిత్రంగా దీనిని పేర్కొనడం కూడా ఈ చిత్రం పట్ల ప్రేక్షకులల్లో పాజిటివ్‌ బజ్‌ ఏర్పడడానికి కారణమైంది.

Samantha's Update on Rangasthalam:

Rangasthalam: Samantha Crucial Update  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ