ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కుటుంబ నేపథ్యంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా రూపొందనుందని ప్రచారంలో ఉంది. పూజా కార్యక్రమాలతో మొదలైన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లోని సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్న త్రివిక్రమ్ నటీనటుల ఎంపిక మీద దృష్టి సారిస్తున్నాడంటున్నారు. ఎన్టీఆర్ పక్కన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తారనే న్యూస్ ఉంది. అందులో భాగంగానే ఒక హీరోయిన్ గా మొదట్లో త్రివిక్రమ్, అను ఇమ్మాన్యువల్ ని అనుకున్నట్లుగా... ఆతర్వాత పూజ హెగ్డే ని తీసుకున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి.
అజ్ఞాతవాసి ప్లాప్ తో అను ఇమ్మాన్యువల్ ని ఎన్టీఆర్ సినిమా నుండి తప్పించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు నాగ శౌర్య తో కలిసి ఛలో వంటి రొమాంటిక్ హిట్ అందుకున్న రష్మిక మండన్నా కి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా ఎన్టీఆర్.. రష్మిక మండన్నా పెరఫార్మెన్స్ కి ముగ్దుడై త్రివిక్రమ్ కి తన పక్కన హీరోయిన్ గా ఆమె అయితే ఎలా ఉంటుందో చూడమని సజెస్ట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే త్రివిక్రమ్, రష్మిక మండన్నా ని ఆడిషన్ చేసి టెస్ట్ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట.
మరి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్స్ విషయమై అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్, రష్మిక మండన్నా ని సజెస్ట్ చేసాడు అనడం కేవలం రూమరంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చూద్దాం ఒక సినిమా హిట్ అనగానే ఆ హీరోయిన్ కి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అని న్యూస్ రావడం సర్వసాధారమైపోయింది. మరి ఇప్పుడు రష్మిక మండన్నా విషయంలోనూ అదే జరిగిందో.... లేదంటే నిజంగానే ఎన్టీఆర్ పక్కన ఆఫర్ రష్మికకి వచ్చిందో.. చూద్దాం.