Advertisementt

శర్వానంద్ డిఫ్రెంట్ గా ట్రై చేస్తున్నాడు!

Sun 04th Feb 2018 09:09 PM
sharwanand,hanu raghavapudi,different look,sai pallavi  శర్వానంద్ డిఫ్రెంట్ గా ట్రై చేస్తున్నాడు!
Sharwanand Different Look in Hanu Raghavapudi Film శర్వానంద్ డిఫ్రెంట్ గా ట్రై చేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

దర్శకుడిగా హను రాఘవపూడి 'లై' సినిమా ఘోరమైన ప్లాప్ ని చవిచూసినా... అతనికి సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ అవకాశం ఇచ్చాడు. హను చెప్పిన కథకి కనెక్ట్ అయిన శర్వానంద్ అనుకున్నదే తడువుగా సినిమాని ఓపెనింగ్ చేసేసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ఇక హను రాఘవపూడి - శర్వానంద్ సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. మరి హను డైరెక్షన్ లో శర్వానంద్.. ఫిదా, ఎంసీఏ బ్యూటీ సాయి పల్లవితో జోడి కడుతున్నాడు.

ఇప్పటికే ఈసినిమాలోని ముఖ్యపాత్రలు సంబందించిన కొన్ని కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం మొత్తం కలకత్తాకు వెళ్ళింది. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతారని తెలుస్తుంది. దేశభక్తి నేపథ్యంలో ఆర్మీకి సంబందించి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ బరువు తగ్గడమే కాదు ఒక డిఫ్రెంట్ లుక్ లోకి మారిపోయాడట. మరి ఎంత బరువు తగ్గాడనుకుంటున్నారు. దాదాపుగా శర్వానంద్ ఈ సినిమా కోసం 10 కిలోలు బరువు తగ్గాడట.

అంతేకాకుండా ఒక డిఫ్రెంట్ హెయిర్ స్టయిల్ లోకి శర్వా మారిపోయాడట. మరి ఆర్మీ లుక్ అంటే ఏ విధంగా ఉంటుందో మనకి ఒక అవగాహన ఉండనే ఉంది. మరి ఆ లుక్ లో శర్వానంద్ ఎలా ఉండబోతున్నాడో అనేది జనాల్లో కాస్త క్యూరియాసిటీగానే ఉంది. 

Sharwanand Different Look in Hanu Raghavapudi Film:

Sharwanand and Hanu Raghavapudi Film Shooting Starts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ