Advertisementt

చరణ్‌, బోయపాటి మూవీ స్పెషల్ హీరోయిన్?

Sun 04th Feb 2018 08:09 PM
ram charan,boyapati srinu,special song,pooja hegde,star heroine,rangasthalam  చరణ్‌, బోయపాటి మూవీ స్పెషల్ హీరోయిన్?
Star Heroine Special Song In Charan and Boyapati Movie చరణ్‌, బోయపాటి మూవీ స్పెషల్ హీరోయిన్?
Advertisement
Ads by CJ

కేవలం రామ్‌చరణ్‌ అనే కాదు.. అందరు స్టార్స్‌కి ఇప్పుడు ఓ ఇంట్రడక్షన్‌ సాంగ్‌, స్పెషల్‌ లేదా ఐటం సాంగ్‌ కంపల్సరిగా మారుతోంది. సుకుమార్‌ సైతం 'రంగస్థలం 1985' చిత్రంలో పూజాహెగ్డేతో ఓ స్పెషల్‌సాంగ్‌ని చిత్రీకరించనున్నాడు. ఇక దీని తర్వాత రామ్‌చరణ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వదినల సెంటిమెంట్‌కి యాక్షన్‌డోస్‌ని ఇచ్చి బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో ఏకంగా రామ్ చరణ్ కి నలుగురు వదినలు అంటే నలుగురు అన్నలు ఉంటారు. స్నేహ, ప్రశాంత్‌లు పెద్ద అన్న, వదినలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా ఇటీవలే స్టార్ట్‌ అయింది. ఇందులో 'భరత్‌ అనే నేను' హీరోయిన్‌ కైరా అద్వానీనే రామ్‌చరణ్‌, బోయపాటితో పాటు దానయ్య ఫైనలైజ్‌ చేశాడు. అయితే ఈ చిత్రంలో కూడా రామ్‌చరణ్‌కి మరో టాప్‌ హీరోయిన్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందట. 

ఇక దేవిశ్రీ ప్రసాద్‌ ఐటం సాంగ్స్‌కి ఇచ్చే ట్యూన్స్‌ ఎలా జనరంజకంగా, మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటాయనేది తెలిసిన సంగతే. దాంతో 'రంగస్థలం 1985'తో పాటు బోయపాటి చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి చరణ్‌ సరసన డ్యాన్స్‌ చేసే ఆ టాప్‌ హీరోయిన్‌ ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

మరోవైపు చరణ్‌ అభిమానులను బోయపాటి చిత్రం ఓ సెంటిమెంట్‌ భయపెడుతోంది. గతంలో శ్రీనువైట్ల తీసిన 'బ్రూస్‌లీ' చిత్రం మొదటి షెడ్యూల్‌లో కూడా రామ్‌చరణ్‌ పాల్గొనలేదు. అది డిజాస్టర్‌ అయింది. ఇప్పుడు బోయపాటి శ్రీను చిత్రం మొదటి షెడ్యూల్‌లో కూడా రామ్‌చరణ్‌ పాల్గొనలేదు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా, లేదా దీపావళి కానుకగా విడుదల చేసి అక్టోబర్‌ నుంచి రామ్‌చరణ్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించే రాజమౌళి చిత్రంలో బిజీ కానున్నాడు. 

Star Heroine Special Song In Charan and Boyapati Movie:

Charan and Boyapati Srinu Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ