Advertisementt

ఒక వి ఫర్ ఫన్.. మరో వి ఫర్ ఫ్రస్ట్రేషన్!

Sun 04th Feb 2018 07:20 PM
venkatesh,anil ravipudi,varun tej,f2 movie,v sentiment  ఒక వి ఫర్ ఫన్.. మరో వి ఫర్ ఫ్రస్ట్రేషన్!
Venkatesh and Varun Tej For Anil Ravipudi F2 ఒక వి ఫర్ ఫన్.. మరో వి ఫర్ ఫ్రస్ట్రేషన్!
Advertisement
Ads by CJ

తెలుగులో మల్టీస్టారర్స్‌కి ఈతరంలో అంకురార్పణ చేసిన సీనియర్‌ స్టార్‌ వెంకటేష్‌. అయితే ఆయన నటించిన చిత్రాలలో సీనియర్‌ స్టార్‌గా తానుండి.. యంగ్‌స్టార్స్‌గా పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, రామ్‌ వంటి వారితో నటించాడు గానీ తన ఏజ్‌ గ్రూప్‌ వారితో మాత్రం నటించలేదు. ఇక ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌, నితిన్‌-శర్వానంద్‌, నాగార్జున-నానిల కాంబినేషన్స్‌లో చిత్రాలు రూపొందనుండటంతో అందరూ వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు సాధారణ కథను కూడా తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో చెప్పే దర్శకునిగా జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ తర్వాత నేటి తరంలో అనిల్‌ రావిపూడి కనిపిస్తున్నాడు. ఈయన తీసిన 'పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌' చిత్రాలతో ఆయన ఈ మ్యాజిక్‌నే చేశాడు. కాగా ప్రస్తుతం ఆయన దిల్‌రాజు నిర్మాణంలో 'ఎఫ్‌2' అనే చిత్రం తీయనున్నాడు. ఎఫ్‌2 అంటే ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్. ఇందులో ఫన్‌ పాత్రను వెంకీ, ఫ్రస్ట్రేషన్ పాత్రను వరుణ్‌తేజ్‌లు చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ఆయన 'వి' వెంకటేష్ ని, మరో 'వి' అయిన వరుణ్‌తేజ్‌ని తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. 

ఇక వరుణ్‌తేజ్‌ విషయానికి వస్తే ఆయన ఈనెల 10 వతేదీన విడుదల కానున్న 'తొలిప్రేమ'తో బిజీగా ఉన్నాడు. మరోవైపు వెంకటేష్‌ 'గురు' తర్వాత ఎంతో గ్యాప్‌ తీసుకుని తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే.. వేటా నాదే' చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వీలున్నంత త్వరగా పూర్తి చేసి బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌కి వెళ్లాలని తేజ ఉన్నాడు. దీంతో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు నటించే అనిల్‌ రావిపూడి చిత్రం మే నెల నుంచి సెట్స్‌కి వెళ్లనుందని తెలుస్తోంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీగా రూపొందనున్న ఈ చిత్రంతో అనిల్‌రావిపూడి సెకండ్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడతాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Venkatesh and Varun Tej For Anil Ravipudi F2:

Anil Ravipudi Gives Clarity on his Upcoming Movie F2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ