Advertisementt

పవన్‌ ప్లానేంటో.. అర్థమైందా?

Sun 04th Feb 2018 03:01 PM
pawan kalyan,janasena,bjp,tdp,chandrababu,ysrcp,andhra pradesh,budget  పవన్‌ ప్లానేంటో.. అర్థమైందా?
Pawan Kalyan Political Plan Revealed పవన్‌ ప్లానేంటో.. అర్థమైందా?
Advertisement
Ads by CJ

పవన్‌ సొంతగా జనసేన పెట్టినా కూడా వచ్చే ఎన్నికల్లో సొంతగా పోటీ చేస్తారా? టిడిపితో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చఆసక్తిగా సాగుతోంది. పవన్‌ తెలంగాణ పర్యటన తర్వాత అనంతపురం పర్యటన చేపట్టాడు. మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లి చర్చించాడు. ప్రభుత్వ వైఫల్యాలను చూపుతూనే ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నాడు. ఇక యువతలో పవన్‌కి ఉన్న బలం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సొంతగా సీఎం అయ్యే స్థాయి తనకు లేదని బాగా తెలుసు. కాబట్టే కేవలం అధికారం నా లక్ష్యం కాదని, తనకు పదవులు అక్కర్లేదని అంటున్నాడు. 

మరోవైపు ఆయన బిజెపి అంటే మండిపడుతున్నాడు. దీనికి తగ్గట్లుగానే కేంద్రబడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగింది. చంద్రబాబు కూడా బిజెపి అధిష్టానంపై మండిపడుతున్నాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అదే మాట అంటున్నారు. పూర్తిగా మెజార్టీ ఉందనేది బిజెపి గర్వంగా వారు చెబుతున్నారు. అయితే తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి సిట్టింగ్‌ స్థానాలను కూడా కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయింది. ఈసారి బిజెపి కేంద్రంలో వచ్చినా కూడా పూర్తి మెజార్టీ రాదని సర్వేలు చెబుతున్నాయి. మిత్రపక్షాలతో కలవడం తప్పనిసరి.

ఇక పవన్‌.. చంద్రబాబు బిజెపితో ఎప్పుడు కటీఫ్‌ చెబితే.. అప్పుడు ఆయన వెంటనే చంద్రబాబుతో పొత్తుకు ఓకే అంటాడని, కేవలం బిజెపితో టిడిపి బంధం తెగేదాకా మాత్రం ఆయన మౌనంగా ఉంటాడని అంటున్నారు. టిడిపి, వామపక్షలు, లోక్‌సత్తా వంటి వారితో కలిసి పవన్‌ మహాకూటమిని ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. మరోవైపు వైసీపీ.. పవన్‌ వల్ల తమకు భయం లేదని చెబుతున్నా కూడా పవన్‌ ఏంమాట్లాడుతున్నాడు? ఆయనకు లభిస్తున్న స్పందన ఎలా ఉంది? వంటి వాటిపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. ఇక టిడిపి బిజెపితో కటీఫ్‌ అయితే జగన్‌ బిజెపితో దోస్తీ అనడానికి రెడీగా ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు. 

Pawan Kalyan Political Plan Revealed:

Pawan Kalyan Janasena Politics Starts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ