మహేష్ ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తాడో కొన్ని విషయాలలో అంత కఠినంగా ఉంటాడు. తన స్టాఫ్ పట్ల ఎంతో ఉదారంగా ఉంటాడు. ఆయనతో కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' చిత్రం నిర్మించాలని రిలయెన్స్ సంస్థ భావించి, వారికి అడ్వాన్స్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్ గురించి రిలయెన్స్ సంస్థ ఏమీ అప్‌డేట్ ఇవ్వలేదు. స్క్రిప్ట్ పూర్తయి, సినిమా షూటింగ్‌కి ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. దీంతో అప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్ చిత్రాలు ఆగిపోవడంతో దర్శకుడు కొరటాల శివ ఎంతో టెన్షన్‌గా ఉన్నాడు. ఆయన మహేష్‌బాబు పీఆర్వో బి.ఎ.రాజుకి ఫోన్ చేసి ఏమైంది అని అడిగాడు. దానికి బి.ఎ.రాజు ఆ చిత్ర నిర్మాతల సంగతి నాకు తెలియదని చెప్పాడు.
దాంతో కొరటాల శివ మహేష్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. బిఎరాజుని పిలిపించిన మహేష్‌బాబు రిలయెన్స్ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించాడు. ఏమో సార్.. రిలయెన్స్ వారు మాకంటూ ఓ పీఆర్వో ఉన్నాడు. మీరు అవసరం లేదని చెప్పారు. దాంతో నేను మౌనంగా ఉన్నాను అని చెప్పాడు. దాంతో తన మనిషిని అవమానించారని మహేష్‌కి విపరీతమైన కోపం వచ్చింది. తన చిత్రాలన్నింటికి పీఆర్వోగా ఉండే బి.ఎ.రాజుని రిలయెన్స్ వారు అవమానించారని తెలుసుకుని రిలయెన్స్ ప్రతినిధులకు కబురు పంపాడు. దాంతో వాళ్లు ఆఘమేఘాల మీద మహేష్ వద్దకు వచ్చారు. వెంటనే మహేష్ వారిచ్చిన అడ్వాన్స్ అయిన ఒకటిన్నర కోటికి చెక్ రాసి వారికిచ్చి వెళ్లిపోమ్మని చెప్పాడు. వెంటనే బిఎరాజుతో ఈ చిత్రం నిర్మించేందుకు ఇంకెవరైనా నిర్మాతలు ఉన్నారా? అని ప్రశ్నించడం, ఎన్నారైలు అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు ముందుకు రావడంతో వారిని నిర్మాతలుగా పెట్టుకున్నాడు.
ఇక తాజాగా మహేష్ తన చిన్ననాడు తన తండ్రి కృష్ణతో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక్కడ మీ మహేష్ మరో ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణతో ఉన్నారు. పక్కనే ఉన్న వ్యక్తి 24 ఏళ్లుగా నాతోనే ఉంటున్నాడు. ఆయన లేనిదే నేను కెమెరా ముందుకు వెళ్లలేను. అది మరెవ్వరో కాదు.. 'మై ఫేవరేట్ కలర్..మై మేన్ ఇన్ బ్లూ పట్టాభి' అంటూ ఆయన పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.