రామ్‌చరణ్ నిన్నమొన్నటి వరకు పరమ రొటీన్ యాక్షన్ చిత్రాలలో నటించాడు. ఈ చిత్రాలు ఆయనకు కెరీర్ ప్రారంభంలో ఉపయోగపడినా కూడా మరీ మూసకట్టుగా ఉండటంతో ఆ తర్వాత అలాంటి చిత్రాలు ఆయనకు భారీషాక్‌నే ఇచ్చాయి. అంతేకాదు.. నాని, శర్వానంద్‌లు కూడా ఓవర్‌సీస్‌లో అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ, ఓవర్‌సీస్‌ని బంగారుబాతుగా మార్చుకుంటూ ఉంటే చరణ్ మాత్రం అక్కడ బాగా వెనకబడి పోయాడు. దాంతో 'గోవిందుడు అందరివాడేలే' వంటి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం చేసినా ఆడలేదు. కానీ తర్వాత 'దృవ' చిత్రంతో క్లాస్ ఆడియన్స్‌కి బాగానే చేరువ అయ్యాడు. మరోవైపు తన తదుపరి చిత్రంగా 'ఇంటెలిజెంట్' దర్శకుడు, జీనియస్ అయిన సుకుమార్‌తో 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తి విభిన్నచిత్రమని చరణ్, సమంత, లొకేషన్ స్టిల్స్, నాటి వస్తువులతో కూడిని పిక్స్ ద్వారా తెలుస్తోంది.
దీంతో ఈ చిత్రంతో క్లాస్‌తో పాటు గ్రామీణ యువకుడిగా మాస్‌ను కూడా మెప్పించడం ఖాయమంటున్నారు. సుకుమార్ మరీ తన తెలివితేటలు ప్రదర్శించకుండా అందరికీ అర్ధమయ్యేలా ఈ చిత్రం తీస్తే ఇది అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రం అవుతుందనే నమ్మకంగా ఉంది. ఆ తర్వాతి చిత్రంగా మాస్‌కే మాస్ అనిపించేలా చిత్రాలు తీసే బోయపాటి శ్రీను చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు గాని ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో రామ్‌చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఇక బోయపాటి చిత్రాలంటే రక్తపాతంతో నిండి, కామెడీకి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేలా ఉండవని అందరికీ తెలుసు. అందుకే మెగాస్టార్ బోయపాటిని పిలిచి రెండు విలువైన సలహాలు ఇచ్చాడట.
కథపరంగా యాక్షన్ సీన్స్ ఓకే గానీ మరీ రక్తపాతం వద్దు. అలాగే సినిమాలో కామెడీకి పెద్ద పీట వేయమని చెప్పాడట. ఈ రెండు చరణ్‌కి మంచిని చేసేవే. ఎందుకంటే రెండు విభిన్న చిత్రాల తర్వాత మూడో చిత్రానికి కూడా లేడీస్, ఫ్యామిలీస్ వస్తారు. వారికి రక్తపాతం ఉండటం, కామెడీ లోటు ఉంటే భరించలేరు. కాబట్టి ఓవర్‌సీస్‌లో కూడా మంచి మార్కులు దక్కించుకోవాలంటే ఈ రెండు కంపల్సరీ. మరి చిరు కోరికను బోయపాటి ఎలా తీరుస్తాడో వేచిచూడాల్సివుంది.