ఈ మధ్యన పవన్ పుణ్యమా, బిగ్ బాస్ పుణ్యమా అని మీడియాలో బాగా హైలెట్ అయిన మహేష్ కత్తి గతంలో క్రిటిక్ అనే విషయం తెలిసిందే. మహేష్ ప్రతి శుక్రవారం విడుదలైన సినిమాలకు రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న 'అజ్ఞాతవాసి' సినిమాకి నెగెటివ్ రివ్యూ ఇవ్వడమే కాదు... బాలయ్య బాబు 'జై సింహా' కి కూడా ట్విట్టర్ లో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. పవన్ వ్యవహారంతో బాగా హైలెట్ అయిన కత్తి.. పవన్ అభిమానుల పుణ్యమా వారితో ప్యాచప్ చేసుకుని సైలెంట్ అయినా.. మీడియాలో ఏదో ఒక విషయంలో నానుతూనే ఉన్నాడు.
ఇప్పుడు తాజాగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'టచ్ చేసి చూడు' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా కత్తి మహేష్ తనకు నచ్చిన రివ్యూ ఇచ్చాడు. 'టచ్ చేసి చూడు' కథ అంతా చాలా కలగాపులగంగా ఉందనీ .. ఈ సినిమా కథతో ప్రేక్షకులను అయోమయానికి గురిచేసిందని కత్తి ట్వీట్ చేశాడు. అలాగే స్టోరీ రైటర్ వక్కంతం వంశీ ఇలాంటి కథను అందిస్తాడని తాను అనుకోలేదనీ... అసలు వంశీ నుంచి తాను ఇలాంటి కథను ఊహించలేదని ట్వీట్ చేశాడు.
అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బావుందని.... ఎడిటింగ్ విషయంలో అసంతృప్తిగా ఉందని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. అయితే కత్తి ట్విట్టర్ రివ్యూకి జబర్దస్త్ హైపర్ ఆది ఘాటైన రిప్లై ఇచ్చాడు. కత్తి మహేష్ ని ఉద్దేశించి హైపర్ ఆది ముందు మీరు మంచి సినిమాలు తీయండి .. అప్పుడొచ్చి రివ్యూలు రాయండి.... అంటూ ఘాటుగా స్పందించాడు.