గత ఏడాది అక్కినేని వారింట రెండు పెళ్లిళ్లు జరగాల్సింది. అక్కినేని వారసులుగా తెలుగు తెరకు పరిచయమైన నాగ చైతన్య అక్కినేని, అఖిల్ అక్కినేని లు ఒకేసారి పెళ్లిళ్లు చేసుకుంటారని అందరూ అనుకున్నారు. 2016 డిసెంబర్ లో చైతు కన్నా ముందే అఖిల్ తన లవర్ అయిన శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయ్యాడు. ఇక నాగ చైతన్య అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ని ప్రేమించి గత ఏడాది జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుని అదే ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్నాడు. కానీ ముందుగా పెళ్లి పీటలెక్కుతాడనుకున్న అఖిల్ మాత్రం తన లవర్ శ్రియ భూపాల్ తో వచ్చిన విభేదాల కారణంగా పెళ్లిని పేకప్ చేసుకుని సింగిల్ గా వుండిపోయాడు.
ఇక ఇప్పట్లో అఖిల్ పెళ్లి చేసుకోడు ఎందుకంటే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న ఈ హీరో కెరీర్ ని ఒక గాడిన పడేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. మరి మరోపక్క అఖిల్ మాజీ లవర్ శ్రియ భూపాల్ అఖిల్ తో బ్రేక్ అయిన వెంటనే ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్ళికి సిద్దపడినట్లుగా వార్తలొచ్చాయి. కానీ అప్పుడు కాదుగాని ఇప్పుడు తాజాగా శ్రియ భూపాల్.. అనిన్ దిత్ అనే కుర్రాడితో పెళ్ళికి రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఆ అనిన్ దిత్ ఎవరోకాదు రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు స్వయానా కజిన్. ఎలాగూ శ్రియ భూపాల్ ఫ్యామిలీతో ఉపాసన ఫ్యామిలీకి మొదటినుండి సత్సంబంధాలు ఉన్న కారణంగా కామినేని కుర్రాడితో జివికె మనవరాలు వివాహానికి రంగం సిద్దమవుతుంది అని అంటున్నారు.
శ్రియ భూపాల్ పెళ్లిని వీలైనంత త్వరగా చేయాలనీ ఇరు కుటుంబాలు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరి అఖిల్ సంగతి ఎలాగున్నా త్వరలోనే శ్రియ భూపాల్ మాత్రం పెళ్లిపీటలెక్కబోతుంది. మరి ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.