Advertisementt

మాస్‌మహారాజా ఆన్సర్స్‌ కి పాస్‌ మార్కులే!

Sat 03rd Feb 2018 07:10 PM
raviteja,touch chesi choodu,promotes,twitter  మాస్‌మహారాజా ఆన్సర్స్‌ కి పాస్‌ మార్కులే!
Mass Raja Ravi Teja Live Chat with Fans in Twitter మాస్‌మహారాజా ఆన్సర్స్‌ కి పాస్‌ మార్కులే!
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా 'బెంగాల్‌టైగర్‌' తర్వాత ఎంతో గ్యాప్‌ తీసుకుని, లోకం చుట్టి వచ్చాడు. ఆ తర్వాత 'రాజా ది గ్రేట్‌' చేసి గాడిలో పడ్డాడు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులు మూస ధోరణిలో ఉండే చిత్రాలు చూడటం లేదని, అందుకే ఆ చిత్రంలో అంధునిగా నటిస్తున్నానని, సినిమాలో ఏదో ఒక వైవిధ్యం లేనిదే చిత్రాలు చేయనని చెప్పాడు. కానీ తాజాగా 'టచ్‌ చేసి చూడు' ఇంటర్వ్యూలో మాత్రం 'నేనింతే, శంభో శివ శంభో, నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌' వంటి ప్రయోగాలు చేస్తే చూడలేదని, తననుంచి ప్రేక్షకులు ఆశించే చిత్రాలే చేస్తానని అన్నాడు. ఇక ఈయన విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో చేస్తున్న 'టచ్‌ చేసి చూడు' ట్రైలర్‌ చూస్తే మరలా ఇది రొటీన్‌ ఫార్ములా చిత్రమే అని తేలిపోతోంది. పైగా కొత్త దర్శకుడు. ప్రమోషన్స్‌ జోరుగా చేయకుండా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో సరిపెట్టారు. 

స్టార్‌ హీరోలే రోజుకొక చానెల్‌కి వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్‌ చేస్తుంటే రవితేజ మాత్రం తాపీగా ఉన్నాడు. సంక్రాంతికి సరైన హిట్‌ రాని అవకాశాన్ని, కేవలం 'భాగమతి' మాత్రమే థియేటర్లలో ఉందనే ప్లస్‌ పాయింట్స్‌ని క్యాష్‌ చేసుకోలేకపోతున్నాడు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ రొటీన్‌గా ఉండటంతో ఓవర్‌సీస్‌లో ఈ చిత్రంపై ఎలాంటి బజ్‌ లేదు. ఏదో తెలుగులో మాత్రం బి,సి సెంటర్ల మాస్‌ అభిమానులు, తనదైన కామెడీ పంచ్‌లు, మాస్‌ చిత్రాలు చూసే వారిని, సీరత్‌కపూర్‌ హాట్‌ అందాలు, రాశిఖన్నా అందాల కోసం వచ్చే ప్రేక్షుకులు ఉంటారేమో గానీ ఓవర్‌సీస్‌ పరిస్థితి అది కూడా కాదని రవితేజ ఇంకా గుర్తించినట్లు లేదు. ఇక తాజాగా ఆయన ట్విట్టర్‌లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. రాజమౌళితో త్వరలోనే సినిమా ఉంటుందని, డైరెక్షన్‌ చేస్తాను గానీ ఇప్పుడు కాదని, అందులో తాను నటించనని, హీరోగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పాడు. 

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలలో తనకి నచ్చేది తనకు తానే అని, సంగీత దర్శకత్వం చేసే ఉద్దేశ్యం లేదని, క్రికెట్‌ అంటే ఇష్టమే... ఇండియా టీమ్‌లోని ప్రతి ఆటగాడు తనకి ఇష్టమేనని చెప్పాడు. సైన్స్‌ ఫిక్షన్‌, మల్టీస్టారర్స్‌ చేస్తానని, బాలీవుడ్‌లో తనకి నచ్చిన హీరో ఎన్ని జన్మలెత్తినా అమితాబ్‌ బచ్చనే అని చెప్పిన ఆయన లావయితే లావయారంటారు. సన్నబడితో సన్నబడ్డానని అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే సన్నదనానికి, పీలదనానికి రవితేజకి తేడా తెలియదని అనుకోవాల్సిందే మరి.

Mass Raja Ravi Teja Live Chat with Fans in Twitter:

Raviteja promotes Touch chesi choodu in Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ