Advertisementt

'మగధీర'లో చిరు డూప్ గా కమెడియన్!

Fri 02nd Feb 2018 09:30 PM
prabhas srinu,magadheera movie,chiranjeevi,duplicate,rajamouli,ram charan  'మగధీర'లో చిరు డూప్ గా కమెడియన్!
Prabhas Srinu About Chiranjeevi and Rajamouli 'మగధీర'లో చిరు డూప్ గా కమెడియన్!
Advertisement
Ads by CJ

ప్రభాస్‌తో తన కెరీర్‌ మొదటి నుంచి ట్రావెల్‌ చేస్తూ, ప్రభాస్‌కి ఇష్టుడిగా పేరున్న నటుడు ప్రభాస్‌ శ్రీను. ఇక ఈయన 'గబ్బర్‌సింగ్‌'తో పాటు పలు చిత్రాలలో కూడా అలరించాడు. పవన్‌తో మాట్లాడుతుంటే అలాగే ఉండిపోవాలని అనిపిస్తుందని, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ లు తనకి బాగా ఇష్టమని చెప్పుకుంటాడు. ఇక కామెడీ నిండిన విలనిజం పాత్రలను ఈయన బాగా చేస్తాడనే పేరుంది. 

ఈయన తాజాగా మాట్లాడుతూ, ఓ సారి ప్రభాస్‌ ఇంట్లో తెల్లవారు ఝాము దాకా వాలీబాల్‌ ఆడి ఇంటికి వచ్చాను. అంతలో రాజమౌళి గారు ఫోన్‌ చేసి చిరంజీవికి డూప్‌గా నటిస్తావా? అని అడిగారు. చేస్తావా ఏంటి అన్నా.. వెంటనే వచ్చేస్తాను అని చెప్పాను. అయితే 'అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు రమ్మని చెప్పాడు. అప్పుడు అక్కడ 'మగధీర' షూటింగ్‌ జరుగుతోంది. ఇక 'మగధీర'లో చిరంజీవి కనిపించేదే కాసేపు. అది కూడా ముమైత్‌ఖాన్‌తో 'బంగారు కోడిపెట్ట' సాంగ్‌ సమయంలో. 

ఇక షూటింగ్‌కి ప్రభాస్‌ శ్రీను చేరుకున్న అనంతరం ఆయనకు చిరంజీవికి వేసిన డ్రస్సే వేశారు. డూప్‌ షాట్స్‌ పూర్తి చేసిన తర్వాత సెట్లో చిరంజీవి గారు కనిపించారు. సేమ్‌ ఆయన వేసుకున్న దుస్తులలోనే ఉన్న నేను ఆయనకు ఎలా ఎదురు వెళ్లగలను? అందుకే తప్పించుకుని తిరిగాను. చిరంజీవికి డూప్‌గా నటించడం నా అదృష్టం అని ప్రభాస్‌శ్రీను చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కి సత్యనారాయణ లాగా, చిరంజీవికి ప్రభాస్‌శ్రీను డూప్‌గా నటించాడన్నమాట...! 

Prabhas Srinu About Chiranjeevi and Rajamouli:

I Acted As Duplicate Chiranjeevi In Magadheera says Prabhas Sreenu  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ