ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. కానీ నాటి నాజూకు తనం, ఫిట్నెస్, అదే చిరునవ్వు ఆమెలో ఇప్పటికీ తొణికిసలాడుతుంటాయి. చిరంజీవి నుంచి శర్వానంద్, ఆనంద్ రాజా వరకు ఈమె నటించని హీరో లేడు. ఇక ఈమెకి ఇప్పటికీ అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఈమె తానే మెయిన్ లీడ్‌లో ఉండాలనే రూల్ ఏమి పెట్టుకోవడం లేదు. తనకంటూ మంచి పాత్ర వస్తే చేసేస్తోంది. ఇక మిగిలిన హీరోలతో పోల్చుకుంటే ఈమె పెట్టే కండీషన్లు, రెమ్యూనరేషన్లు కూడా తక్కువేనట. దాంతో ఆమె యంగ్ హీరోలతోనే కాదు.. సీనియర్ స్టార్స్ సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.
ఇక కొన్ని చిత్రాలలో కీలకపాత్రలు వస్తే ఓ పది పదిహేను రోజుల కాల్షీట్స్ కేటాయించి, నిర్మాతలకు అందుబాటులో ఉంటూ చిన్న చిత్రాలకు కూడా పెద్ద అండగా, ఎస్సెట్‌గామారుతుండటంతో ఈమెకి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇలా తన పారితోషికం బాగా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ఉండటంతో పలు చిత్రాలు ప్రారంభమైన తర్వాత కూడా ఈమె మద్యలో ఎంట్రీ ఇస్తోంది.
నాటి 'చెన్నకేశవరెడ్డి' నుంచి మొన్నటి 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', నాటి 'సుభాష్ చంద్రబోస్' నుంచి నిన్నటి 'గోపాల గోపాల' వరకు ఈమె వరుసపెట్టి చిత్రాలు చేస్తోంది. ఇక ఈమెకి ఇలాంటి మంచి సలహాలను కెరీర్ ప్రారంభంలోనే చెప్పి గైడెన్స్ ఇచ్చిన నిర్మాత స్రవంతి రవికిషోర్. కాగా ప్రస్తుతం ఈమె కళ్యాణ్‌రామ్, వీరభోగవసంతరాయులు, నరగాసురన్‌లలోనటిస్తోంది. ఎంతైనా శ్రియ బహుతెలివైంది కదా..!