మన సమాజంలో ఆస్థికులకు, నాస్తికులకు ఉన్న వైరం అందరికీ తెలిసిందే. మన వేదాలను ఓ పాఠ్యాంశాలుగా, వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా, సంఖ్యాశాస్త్రం, సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తాయి? ఏ సమయంలో వస్తాయి? అని కరెక్ట్‌గా చెప్పిన మన పూర్వీకుల తెలివికి అబ్బురపడి విదేశీయులే మన గ్రంధాలు, పురాణాలపై పరిశోధనలు చేస్తున్నారు. నేడు ఉన్న సాంకేతిక లేని రోజుల్లోనే ఏ రోజు గ్రహణం వస్తుందో మన పూర్వీకులు శాస్త్రీయంగా నిరూపించారు. మన పెద్దలు చెప్పిన వాటిలో ఎంతో సైన్స్ కూడా ఉంది. కానీ కొందరు అతివాద, తెలిసి తెలియని స్వామీజీలు, జ్యోతిష్కుల వల్ల మన పూర్వీకులకు చెడ్డపేరు వస్తోంది.
ఇక దేవుడు అనేది నమ్మకం, అది మనిషికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. కర్మ సిద్దాంతం ఎందరి జీవితాలలోనో మనశ్శాంతిని ఏర్పరిచింది. చివరకు మేధావులు కూడా ఏదో బలమైన శక్తి మనల్ని నడుపుతోందని ఒప్పుకుంటారు. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలు చేసే సమయంలో ఇస్రో చైర్మన్ నుంచి శాస్త్రవేత్తలు, చివరికి అబ్దుల్ కలాం కూడా పక్కనే ఉన్న సూళ్లూరుపేట చెంగాలమ్మని దర్శనం చేసుకుని, పూజలు చేస్తారు. ఇక ఈ మద్య ఎక్కువగా హేతువాది బాబు గోగినేని పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన రాజమౌళిని కూడా తప్పుపట్టాడు. నాస్తికుడిని అని చెప్పుకునే జక్కన్న 'బాహుబలి'లో శివలింగానికి అంత మహత్యం ఆపాదించడం ఏమిటి? అని ప్రశ్నించాడు.
కానీ వృత్తి వేరు.. ప్రవృత్తివేరని బాబు గోగినేని గుర్తించగలగాలి. ఇక తాజాగా ఈయన దివంగత ఎన్టీఆర్‌కి జ్యోతిష్యంపై ఎంతో నమ్మకం ఉందని, అందుకే అభ్యదయవాదినని చెప్పుకునే సి.నారాయణరెడ్డిని హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి వైస్ చైర్మన్‌ని చేశాడని, ఇద్దరు కలిసి జ్యోతిష్యాన్ని కోర్స్‌గా మార్చారని విరుచుకుపడ్డాడు. జ్యోతష్యులు చేసేది ప్రోఫెషనల్ డిగ్రీ కాదు.. వారు ఆర్ట్ డిగ్రీ చేస్తున్నారు.
ఇలా తామరతంపరగా జ్యోతిష్కులు ఏర్పడటం, వారి పొగరు చూస్తే ఎన్టీఆర్, సినారెలు చేసింది తప్పని ఖచ్చితంగా చెబుతానన్నాడు. మరోవైపు గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు.. తాగకూడదు అనేది నిజం కాదని చెప్పి టీ, బిస్కెట్స్ తిన్నాడు. బిర్యాని తెప్పిస్తే కూడా తినేవాడిని కదా... అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. బాబూ.. గోగినేని, కొందరు దొంగ స్వాములను, బాబాలని చూసి అందరినీ అదే గాటన కట్టడం సరికాదనే చెప్పాలి.