సినిమాలలో నేడు కంటెంట్ ఎంత ముఖ్యమో ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడం ఇంకా ముఖ్యం. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలకి ఇది కంపల్సరీ. దాంతో ప్రమోషన్స్‌తో పాటు మంచి నానుడిలో ఉంటే టైటిల్‌ని పెట్టడం కూడా కీలకంగా మారుతున్నాయి. ఇక సినిమా టైటిల్స్ అనేవి హీరోల పేర్ల మీదనో, పాత సెంటిమెంట్స్. పాటలు, పదాల నుంచే ఎక్కువగా పుట్టడం చూస్తూనే ఉన్నాం. ఇక నాగశౌర్య, రష్మిక మండన్న నటించిన 'ఛలో' చిత్రం ఒకవైపు మాస్ మహారాజా స్టైల్ పక్కా మాస్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'టచ్ చేసి చూడు'తో పాటు, 'హౌరాబ్రిడ్జ్' లాంటి హడావుడి లేకుండా సైలెంట్ కిల్లర్‌గా మారాలని చూస్తోన్న చిత్రాలతో పోటీ పడుతోంది. ఈ పోటీలో నాగశౌర్య తాను మొదటి సారి నిర్మించి, నటించిన 'ఛలో' చిత్రంపై మంచి ఆశలే పెట్టుకున్నాడు. మెగాస్టార్ వల్ల కాస్త బజ్ రావడం, ట్రైలర్, సాంగ్స్ బాగా ఉండటంతో ఈ చిత్రం యూత్‌ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రానికి 'ఛలో' అనే టైటిల్ పెట్టడం వెనుక జరిగిన సంఘటనలను నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి 'క్యాచీ' టైటిల్ పెట్టాలని ఎంతగా ఆలోచించినా సూట్ కాలేదట. దాంతో ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు రామ్‌చరణ్ నటించిన 'బ్రూస్‌లీ' చిత్రంలోని 'లే ఛలో' పాట వింటూ ఉంటే 'ఛలో' అనే పదం క్యాచీగా ఉండటమే కాదు.. తమ సబ్జెక్ట్‌కి పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుందని భావించడం, దానికి దర్శకుడు వెంకీ కుడుముల, నాగశౌర్య తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరిగిందని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందని, కానీ నైజాంలో తానే విడుదల చేస్తానని, హిందీ రీమేక్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయని చెబుతున్న నాగశౌర్య ఫిబ్రవరి చివరి నుంచి సాయి శ్రీరాం దర్శకత్వంలో ప్రారంభమయ్యే చిత్రంలో నటించనున్నానని తెలిపాడు.