దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ నిత్యం వార్తల్లో ఉంటోంది. వివాహం, విడాకులు, సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చి చేస్తున్న గ్లామర్ షోతో పాటు తప్పుడు దృవీకరణ పత్రాలతో 20లక్షల రూపాయల పన్నుని కేరళ ప్రభుత్వానికి ఎగ్గొటేందుకే ఆమె పాండిచేరిలోని తప్పుడు ఇంటి అడ్రస్‌తో లగ్జరీ కారుని కొన్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈమె తాజాగా అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైంది. ఈ కేసులో సాక్ష్యాలు బలంగా ఉండటంతో ఈమెకి జైలు శిక్ష ఖాయమని అంటున్నారు. తాజాగా అమలాపాల్ ఓ వ్యక్తి మీద లైంగిక వేదింపుల కేసును పెట్టింది. చెన్నైలోని డ్యాన్స్ స్కూల్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త అళగేషన్ తన విషయంలో మాటలు చేతలతో నానా విధాలుగా వేధించాడని, తనను లైంగిక వేధింపులకు గురి చేసిన ఆయనను అరెస్ట్ చేయాలని చెన్నైలోని పాండిబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు ఆఘమేఘాలు మీద అళగేషన్‌ని అరెస్ట్ చేశారు. ఎంతో పలుకుబడి ఉన్న సినిమా నటి అయిన తన మీదనే ఇలా వేధింపులు జరుపుతుంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందోనని ఆమె వ్యాఖ్యానించింది. అళగేషన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మలేషియాలో డిన్నర్‌కి వెళ్లాలని అసభ్యంగా కోరాడని ఆమె ఆరోపిస్తోంది. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని, మాటలతో చేతలతో లైంగిక వేధింపులు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉన్నాయని అంటోంది.
ఇక ఆమెపై ఉన్న కారు చీటింగ్ కేసు వివాదాన్ని దారి మరలించేందుకే అమలా పాల్ ఇలా వ్యవహరిస్తోందని, నిజానికి ఆ పారిశ్రామిక వేత్తతో ఆమెకి సాన్నిహిత్యం ఎక్కువని, ఆయన నుంచి పలుసార్లు ఆర్ధికలబ్దిని కూడా ఆమె పొందిందని కోలీవుడ్ మీడియా అంటోంది. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు చెన్నైలో హాట్‌టాపిక్‌గా మారింది.