ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల జోరు అంతగా లేకపోయినా ఈ నెలలో మార్చ్ నెలలో వరస పెట్టి సినిమా వస్తున్నాయి. ఈ శుక్రవారం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వచ్చే వారంలో 4 కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ సినిమాలు అన్ని పరిశీలిస్తే.. ఒక్క వినాయక్ తీసిన ఇంటెలిజెంట్.. అలానే మదన్ తీసిన గాయత్రి సినిమాలు మిగిలిన సినిమాలన్నీ కొత్త దర్శకులు రూపొందించినవే కావడం ఆశ్చర్యకరం.
అంటే టాలీవుడ్ కి నలుగురు కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ కాబోతున్నారు అనమాట. రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'టచ్ చేసి చూడు'. ఈ సినిమాలో మాస్ మహా రాజా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాని విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. అదే రోజు నాగశౌర్య నటించినా 'ఛలో' కూడా వస్తోంది. ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు. వీరిద్దరూ కొత్త దర్శకులే. ఇదే జోరు వచ్చే వారం కూడా రంజుగా ఉండనుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'తొలి ప్రేమ'. నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ' తెరకెక్కించాడు శరణ్ కొప్పిశెట్టి. ఇక ఈ సినిమాలతో పాటు వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఇంటెలిజెంట్'.. మదన్ డైరెక్షన్ మోహన్ బాబు, విష్ణు నటించిన 'గాయత్రి' విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే అందరు కొత్త డైరెక్టర్స్ అవ్వడంతో టాలీవుడ్ కి కొత్త కళ రాబోతుంది. మరి వీరిలో హిట్ కొట్టేదెవరో? చూడాలి.